బైడెన్ దూకుడు..వైట్ హౌస్ లో అధికారుల నియామకం..! ట్రంప్ ఆటలు ఇక సాగనట్టేనా!

Wed Nov 18 2020 20:00:34 GMT+0530 (IST)

Biden aggression .. Appointment of officers in the White House ..! Trump games are no longer going o

ఇటీవల అమెరికా అధ్యక్షుడిగా ఎన్నికైన డెమొక్రాట్ల అభ్యర్థి జో బైడెన్ను వైట్ హౌస్ లోకి అడుగుపెట్ట నీయకుండా చేసేందుకు ప్రస్తుత అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ కుట్రలు చేస్తున్నారు. బైడెన్ తప్పుడు పద్ధతిలో ఎన్నికయ్యారని.. అక్రమాలు చేసి ఎన్నికల్లో గెలుపొందారని ట్రంప్ ఆరోపించారు. ఈ విషయంపై కోర్టుల్లో కేసులు కూడా వేశారు. అయితే జో బైడెన్ మాత్రం ట్రంప్ వ్యాఖ్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. తనను ప్రజలను ఎన్నుకున్నారని.. చట్టబద్దంగా తాను ఎన్నికయ్యానని చెబుతున్నారు. ట్రంప్ ఎన్ని కుట్రలు చేసినా వైట్ హౌస్ కు వెళ్లి అధ్యక్షుడిగా బాధ్యతలు చేపడుతానని చెప్పారు. డొనాల్డ్ ట్రంప్ ఓటమిని అంగీకరించి.. వైట్ హౌస్ ను వదిలిపెడితే గౌరవప్రదంగా ఉంటుందని బైడెన్ వర్గీయులు సూచిస్తున్నారు. ట్రంప్ తన ఓటమిని అంగీకరించాలని మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా కూడా సూచించారు. అయినప్పటికీ  ట్రంప్ వెనక్కి తగ్గడం లేదు. అయితే కొత్త అధ్యక్షుడు జో బైడెన్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు సమాయత్తమవుతున్నారు. అధికార యంత్రంగం - సలహదారుల వ్యవస్థను ప్రక్షాళన చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. డొనాల్డ్ ట్రంప్ - రిపబ్లికన్ పార్టీ మద్దతుదారులు చేస్తోన్న ఆరోపణలు - ఆందోళనలను ఆయన ఏ మాత్రం పట్టించుకోవడం లేదు.  

 ఇప్పటికే వైట్ హౌస్ కోసం పలువురు కొత్త సలహదారులను నియమించారు. వారంతా వైట్ హౌస్ అడ్వైజర్లుగా పనిచేస్తారని జో బైడెన్ వెల్లడించారు. ఈ మేరకు ఆయన కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. తన ఎన్నికల ప్రచార వ్యూహకర్తగా పనిచేసిన జెన్ ఓ మ్యాలీ డిల్లాన్ ను వైట్ హౌస్ డిప్యూటీ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమించారు. లూసియానా క్యాంపెయిన్ రెప్రజెంటేటివ్ సెడ్రిక్ రిచ్ మండ్ కు  సలహాదారు పదవిని అప్పగించారు. స్టీవ్ రిచ్చెట్టినీ సీనియర్ అడ్మినిస్ట్రేటర్ గా నియమించారు. బైడెన్ ఎన్నికల క్యాంప్ లో డిప్యూటీ మేనేజర్లుగా పనిచేసిన డానా రెమ్యుస్ - జూలీ ఛావెజ్ రోడ్రిగ్జ్ లకు వైట్ హౌస్ సలహాదార పదవి దక్కింది.

రోడ్రిగ్జ్ వైట్ హౌస్ ఇంటర్-గవర్నమెంటల్ ఎఫైర్స్ డైరెక్టర్ గా నియమితులయ్యారు. బైడెన్ ట్రావెలింగ్ చీఫ్ ఆప్ స్టాఫ్ అన్నే టొమాసినికి వైట్ హౌస్ ఓవల్ ఆఫీస్ ఆపరేషన్స్ డైరెక్టర్ బాధ్యతల్లో కూర్చోబెట్టారు. ఎన్నికల క్యాంప్ సీనియర్ అడ్వైజర్లు ఆంథొని బెర్నాల్ - జిల్ బిడెన్ - మాజీ అధ్యక్షుడు బరాక్ ఒబామా ప్రభుత్వంలో ఉరుగ్వే రాయబారిగా పనిచేసిన జులిస్సా ప్యాంటాలియోన్ ను కూడా అడ్వైజర్లుగా నియమించారు.