Begin typing your search above and press return to search.

లాక్‌ డౌన్‌ తో అంద‌రికీ నష్టాలొచ్చినా..వారికి లాభాలొచ్చాయి

By:  Tupaki Desk   |   24 May 2020 1:00 PM GMT
లాక్‌ డౌన్‌ తో అంద‌రికీ నష్టాలొచ్చినా..వారికి లాభాలొచ్చాయి
X
మ‌హ‌మ్మారి వైర‌స్ విజృంభ‌ణ‌తో ప్ర‌పంచ‌వ్యాప్తంగా ఆర్థిక కార్య‌క‌లాపాలు స్తంభించాయి. వ్యాపార‌, వాణిజ్యంతో పాటు అన్ని రంగాలు కుదేల‌య్యాయి. దీంతో అన్ని రంగాల వారు తీవ్రంగా దెబ్బ‌తిన్నారు. ఆయా కంపెనీలు, సంస్థ‌లు భారీగా న‌ష్టాలు చ‌విచూశాయి. అయితే ఈ స‌మ‌యంలోనూ కూడా కొన్ని సంస్థ‌లు భారీగా లాభాలు ఆర్జించాయి. వారికి లాక్‌డౌనే పెద్ద‌మొత్తంలో లాభాలు తెచ్చిపెట్టాయి. వారే అమెజాన్ వ్యవస్థాపకుడు జెఫ్ బెజోస్ - టెస్లా చీఫ్ ఎలాన్ మస్క్. వీరితోపాటు మ‌రికొంద‌రి సంపద భారీగా పెరిగింది. దాదాపు 10 శాతం వారి సంప‌ద పెరిగిందని ఇన్‌స్టిట్యూట్ ఫర్ పాలసీ స్టడీస్ (ఐపీఎస్‌) ప్ర‌క‌టించింది.

లాక్‌ డౌన్‌ తో ఒక‌వైపు నిరుద్యోగం - పేద‌రికం పెర‌గ‌గా.. మ‌రోవైపు బిలియనీర్ల సంపద భారీ స్థాయిలో పెరిగింది. ప్ర‌స్తుతం వీడియో కాన్ఫ‌రెన్స్‌ల‌కు.. వీడియో కాల్స్‌కు ఎంతో ఉప‌యోగ‌ప‌డిన జూమ్ వంటి సంస్థ‌లు స్టాక్స్ మార్కెట్‌ లో అద్భుతంగా రాణించాయి. లాక్‌డౌన్ నేప‌థ్యంలో అంద‌రూ వర్క్ ఫ్రమ్ హోమ్ చేయ‌డంతో వారంతా వీడియో కాన్ఫరెన్సింగ్, రిమోట్ వర్క్ టెక్నాలజీ వినియోగించారు. దీంతో జూమ్ వంటి యాప్‌లు వాడారు. దీంతో ఆ సంస్థ స్టాక్స్ విలువ భారీగా పెరిగింది. ఏప్రిల్ నాటికి వాటి విలువ భారీగా పెరిగాయి.

జెఫ్ బెజోస్, జూమ్ వీడియో కమ్యూనికేషన్ ఫౌండర్ ఎరిక్ యాన్, ఎలాన్ మస్క్, జుకర్ బర్గ్ సహా ఎనిమిది మంది టాప్ బిలియనీర్ల సంపద పెరిగింది. జెఫ్ బెజోస్‌ కు చెందిన అమెజాన్ స్టాక్స్ ఈ ఏడాదిలోనే 31 శాతం లాభపడ‌డం విశేషం. షట్‌డౌన్ కారణంగా ప్రజలు బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీంతో ఇళ్ల నుంచి డోల్ డెలివ‌రీ భారీగా పెరిగాయి. దీంతో ఆన్‌లైన్ సేల్స్ పెరిగి అమెజాన్ స్టాక్స్ భారీగా లాభపడ్డాయి. జెఫ్ బెజోస్ సంపద 147.6 బిలియన్ డాలర్లకు చేరుకుంది.

ఈ ఏడాది ప్రారంభం నుంచి టెస్లా షేర్లు కూడా భారిగా పెరిగాయి. టెస్లాలో మస్క్‌ కు 18.5 శాతం వాటా ఉంది. దీంతో ఎలాన్ మస్క్ సంపద కొద్ది నెలల్లోనే 1 బిలియన్ డాలర్లు పెరిగిందని అంచ‌నా. ఫేస్‌బుక్ కూడా ప్ర‌జ‌లు తెగ చూసేశారు. ష‌ట్‌ డౌన్ ఖాళీగా ఉన్న ప్ర‌జ‌లు ఫేసుబుక్‌ తో కాల‌క్షేపం చేశారు. దీంతో ఫేస్‌బుక్ విలువ పెరిగి భారీ లాభాలు నమోదు చేసింది. దీంతో జుకర్ బర్గ్ ఆస్తులు పెరిగాయి. 33 లక్షల కోట్లు వారి సంప‌ద పెరిగింది.

ఈ విధంగా అమెరికాలోని 600 మంది బిలియనీర్లు టెక్ స్టాక్స్‌లో ర్యాలీతో మరింత సంపాదించారు. మైక్రోసాఫ్ట్ బిల్ గేట్స్, బెర్క్‌షైర్ ‌హాత్‌వే వారెన్ బఫెట్ లు మాత్రం కొద్దిమొత్తంలో లాభప‌డ్డారంతే.