Begin typing your search above and press return to search.

పూరన్ ఫీల్డింగ్ పై మాస్టర్ బ్లాస్టర్ ఫిదా!

By:  Tupaki Desk   |   28 Sep 2020 2:00 PM GMT
పూరన్ ఫీల్డింగ్ పై మాస్టర్ బ్లాస్టర్ ఫిదా!
X
ఐపీఎల్ లో భాగంగా ఆదివారం షార్జాలో పంజాబ్, రాజస్థాన్ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ లో జరిగిన రాజస్థాన్ భారీ లక్షాన్ని సాధించి విజయం సాధించగా..అత్యుత్తమ ఫీల్డింగ్ తో ఆకట్టుకున్న పంజాబ్ ఆటగాడు నికోలస్ పూరన్ పై ప్రశంసల జల్లు కురుస్తోంది. మ్యాచులో నికోలస్ పూరన్ కళ్లు చెదిరే ఫీల్డింగ్‌ తో ఆకట్టుకున్నాడు. క్రికెట్ చరిత్రలోనే ది బెస్ట్ అనేలా బౌండరీ లైన్ దగ్గర బంతిని ఆపాడు. స్పిన్నర్ మురుగన్ అశ్విన్ వేసిన ఇన్నింగ్స్ 8వ ఓవర్ లో సంజూ శాంసన్ డీప్ మిడ్ వికెట్ దిశగా భారీ షాట్ ఆడాడు. దాన్ని అందరూ సిక్స్ అనుకున్నారు. అయితే బౌండరీకి వెలుపల కొంత దూరంలో బంతి పడుతుండగా.. పూరన్ అమాంతం బౌండరీ లైన్ వెలుపలకు దూకాడు. బౌండరీ లైన్‌ను తాకకుండా బంతిని ఒడిసి పట్టుకున్నాడు. ఒకవేళ అతడు కింద పడితే అది సిక్సే. కానీ అతడు సెకండ్ వ్యవధి లో కిందపడే లోగా బాల్ ని పట్టేసి బౌండరీ లైన్ నుంచి మైదానం వైపు బాల్ ని విసిరాడు. అలా సిక్స్ వెళ్లాల్సిన బాల్ ని పూరన్ ఆపడంతో కేవలం రెండు పరుగులే వచ్చాయి. పూరన్ విన్యాసాన్ని చూసి ఆ జట్టు ఫీల్డింగ్ కోచ్ జాంటీ రోడ్స్ కూడా స్టన్నయ్యాడు. డగ్ ఔట్ లో లేచి నిల్చుని చప్పట్లతో అభినందించాడు. పూరన్‌ పక్షిలా ఎగరడం చూసి క్రికెట్ ఫ్యాన్స్ అభిమానులు అతడికి ఫిదా అయ్యారు. పూరన్ చేసిన ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియా లో వైరల్ అవుతోంది.

నికోలస్ పూరన్ ఫీల్డింగ్‌ పై క్రికెట్ దిగ్గజం సచిన్ టెండుల్కర్ స్పందించాడు. ఆ వీడియో పోస్టు చేస్తూ 'నా జీవితం లో నేను చూసిన బెస్ట్ సేవ్ ఇదే. నమ్మశక్యం కావడం లేదు' అని ట్వీట్ చేశాడు. ' పూరన్ ఫీల్డింగ్ పై ఎంత చెప్పినా తక్కువే. పరుగులు ఆపడానికి ఇంతలా ఫీల్డింగ్‌ చేయడం తాను ఇంత వరకూ ఎప్పుడూ చూడలేదు. దీనిని మళ్లీ చూడాలని ఉంది.. ప్లే చేయండి' అని కామెంటర్ హర్షా భోగ్లే పేర్కొన్నాడు. 'క్రికెట్, జీవితంలో నిమిషాల్లో మార్పులు జరుగుతాయి' అని వీరేందర్ సెహ్వాగ్ ట్వీట్ చేశాడు. 'నా జీవితంలో చూసిన ఉత్తమ ఫీల్డింగ్ ' ఇదే అని ఇంగ్లండ్ మాజీ కెప్టెన్ కెవిన్ పీటర్సన్ ట్వీట్ చేశాడు. హాట్‌స్టార్ కూడా ఈ పంజాబ్ ఆటగాడిని ప్రశంసిస్తూ ట్వీట్ చేసింది. పూరన్ పక్షిలా గాల్లోకి ఎగిరి బౌండరీ లైన్‌కు అవతలికి వెళ్లిపోయి బంతిని క్యాచ్ పట్టాడు. మిల్లీ సెకెండ్ వ్యవధిలో దాన్ని మైదానంలోకి విసిరేయడంతో ఆ ఫీల్డింగ్ వీడియో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతోంది.