Begin typing your search above and press return to search.

షాకింగ్ : ఆ మంత్రికి కూడా వైరస్ సోకిందట !

By:  Tupaki Desk   |   29 May 2020 12:30 PM GMT
షాకింగ్ : ఆ మంత్రికి కూడా వైరస్ సోకిందట !
X
ప్రపంచ వ్యాప్తంగా వైరస్ మహమ్మారి తీవ్ర స్థాయిలో విజృంభిస్తోంది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా దాదపు 60 లక్షల మందికి వైరస్ సోకింది. అలాగే 362,618 మంది వైరస్ భారిన పడి ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్ కులం, మతం, భాష, ప్రాంతం అన్న తేడా లేకుండా.. అందర్నీ కాటేస్తోంది. మనదేశంలో కూడా వైరస్ పాజిటివ్ కేసులు రోజురోజుకి పెరిగిపోతున్నాయి. తాజాగా బెంగాల్‌ కు చెందిన అగ్నిమాపక శాఖ మంత్రి సుజిత్ బోస్‌ ‌ని కూడా కాటేసింది.

వ‌ల‌స కూలీల స‌మ‌స్య‌ల ప‌రిష్కారం, అంఫాన్ తుఫాన్ స‌హాయ చర్య‌ల్లో భాగంగా క్షేత్ర స్థాయిలో ఉండి ప‌ని చేస్తూ ప్ర‌జ‌ల్లో ఉంటున్న‌ ఆయ‌నకు క‌రోనా ల‌క్ష‌ణాలు క‌నిపించ‌డంతో ఆప్ప‌త్రిలో చేరారు. అయితే, వైరస్ లక్షణాలు కనిపించడంతో అయనకి వైరస్ నిర్దారణ పరీక్ష చేయగా పాజిటివ్ వ‌చ్చింది. దీంతో ఆయన కుటుంబ సభ్యులకు వైరస్ పరీక్షలు నిర్వహించగా అతని భార్యకు కూడా వైరస్ పాజిటివ్‌ తేలడంతో వారిద్దరినీ స్వీయ నిర్భందంలో ఉండాలని వైద్యులు సూచించారు.

అలాగే , మంత్రిగారు గత కొన్ని రోజులుగా అంఫన్‌ తుఫాన్‌ సహాయక చర్యల్లో చురుగ్గా పాల్గొంటున్నారు. ప్రస్తుతం మంత్రి ఈ మహమ్మారి బారిన పడటంతో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయ‌న విస్తృతంగా ప‌ర్య‌టించిన నేప‌థ్యంలో ఎవ‌రి ద్వారా వైర‌స్ సోకింద‌న్న దానిపై లింక్ గుర్తించ‌డం క‌ష్టంగా మారింది. దీంతో రెస్క్యూ ఆప‌రేష‌న్ల‌లో ఆయ‌న‌తో కాంటాక్ట్ అయిన వారు స్వ‌చ్ఛందంగా హోం క్వారంటైన్ లో ఉండాల‌ని అధికారులు సూచించారు. కాగా , కాగా, ప‌శ్చిమ బెంగాల్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 4536 వైరస్ కేసులు న‌మోదయ్యాయి. అందులో 295 మంది మ‌ర‌ణించ‌గా.. 1668 మంది పూర్తిగా కోలుకుని డిశ్చార్జ్ అయ్యారు.