ఆంధ్రప్రదేశ్ లో లక్షకు దిగువన యాక్టివ్ కేసులు .. కొత్తగా ఎన్నంటే ?

Thu Jun 10 2021 18:53:43 GMT+0530 (IST)

Below one lakh active cases in Andhra Pradesh

ఏపీలో కరోనా వైరస్ మహమ్మారి తీవ్రత కొనసాగుతోంది. ప్రభుత్వం కరోనా మహమ్మారి కట్టడికి ఎన్ని ప్రయత్నాలు చేస్తున్నా కూడా కరోనా మహమ్మారి అదుపులోకి రావడంలేదు. గత 24 గంటల్లో ఆంధ్రప్రదేశ్ లో 97863 మందికి కరోనా పరీక్షలు నిర్వహించగా 8110 మందికి కరోనా పాజిటివ్ గా నిర్థారణ అయ్యింది. నిన్న ఒక్కరోజే కరోనా బారిన పడి 67 మంది మృత్యువాతపడ్డారు. దీనితో రాష్ట్రంలో మొత్తం కరోనా వైరస్  మరణాల సంఖ్య 11763 కు చేరింది. గడిచిన 24 గంటల్లో 12981 మంది కరోనా వైరస్ నుండి  కోలుకుని క్షేమంగా డిశ్చార్జ్ అవ్వగా ఇప్పటివరకు 16 లక్షల 77 వేల 063 మంది డిశ్చార్జ్ అయ్యారు.ఈ మేరకు రాష్ట్ర వైద్యారోగ్య శాఖ బుధవారం కరోనాపై హెల్త్ బులెటిన్ విడుదల చేసింది. ఏపీలో ప్రస్తుతం 99057 యాక్టివ్ కేసులు ఉన్నాయి. రాష్ట్రంలో నేటి వరకు 20137627 కరోనా నిర్థారణ పరీక్షలు నిర్వహించారు. గత 24 గంటల్లో జిల్లాల వారీగా నమోదైన కరోనా కేసులు వివరాలు.. శ్రీకాకుళం- 461 విజయనగరం- 280 విశాఖ- 502 తూ.గో- 1980 ప.గో- 837 కృష్ణా- 339 గుంటూరు- 520 ప్రకాశం- 711 నెల్లూరు- 391 చిత్తూరు- 974వ అనంతపురం- 960 కర్నూలు- 338 వైఎస్ఆర్ జిల్లా- 582 కేసులు నమోదయ్యాయి.