అప్పు చేసి పప్పు కూడు తింటున్న బెంగళూరోల్లు

Mon Jan 20 2020 17:26:21 GMT+0530 (IST)

Bangalore People Loans

లక్షల్లో జీతం.. లక్షణమైన జీవితం.. సాఫ్ట్ వేర్ జాబ్. అవును శని ఆదివారాలు పండుగ చేసుకోవచ్చు. 5 రోజుల పనికే లక్షల జీతాలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లకు వచ్చిపడతాయి. వాటిని ఏం చేసుకుంటారు. అందుకే ఇలా అప్పులు తీసుకొని వాటిని ఈఎంఐల రూపంలో చెల్లిస్తూ జల్సా చేస్తారు. ఐటీ భూమ్ వచ్చాక సాఫ్ట్ వేర్ నౌకరి చేసే వాళ్ల పంట పండింది. తెలివితో చేసే పని కావడంతో ఎంత టాలెంట్ ఉంటే అన్ని లక్షల జీతం వచ్చిపడేది. అయితే ఇన్ని లక్షలు సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఏం చేసుకుంటారు? సాలరీ నుంచి ప్రభుత్వానికి పన్ను రూపంలో వృథాగా కట్టడం ఎందుకు? అందుకే సాఫ్ట్ వేరర్లు అత్యధికంగా లోన్లు తీసుకొని ఇన్వెస్ట్ చేస్తుంటారు.దేశంలోనే ఐటీ రంగానికి హబ్ బెంగళూరు. ఈ సాఫ్ట్ వేర్ సిటీ ఇప్పుడు అరుదైన ఘనత సాధించింది. ఆర్థిక రాజధాని ముంబైని బీట్ చేసేసింది. ఎందులో అనుకుంటున్నారా? అత్యధికంగా లోన్లు తీసుకోవడంలో.. అవును బెంగళూరులో స్థిరపడిన సాఫ్ట్ వేర్ ఇంజినీర్లు ఇతర సాధారణ ప్రజలు వ్యాపారులు పారిశ్రామిక వర్గాల వారంతా ఇబ్బడిముబ్బడిగా అప్పులు చేస్తున్నట్టు తేలింది. దేశంలోనే అత్యథిక హోమ్ లోన్స్ పర్సనల్ లోన్స్ తీసుకుంటున్న వారిలో బెంగళూరు వాసులే ఫస్ట్ అట... ఇన్నాళ్లు మొదటి స్థానంలో ఉన్న ముంబైని పక్కనపెట్టి బెంగళూరు వాసులు మొదటి స్థానానికి చేరడం విశేషం.

2019 సంవత్సరంలో దేశంలోనే అత్యధిక హోమ్ లోన్స్ బెంగళూరులో తీసుకున్నారట.. ముంబైలో హోమ్ లోన్స్ సైజు రూ.2కోట్లుగా ఉంటే.. దాన్ని అధిగమించిన బెంగళూరు వాసులు రూ.2.2 కోట్లతో మొదటి స్థానాన్ని కొట్టేశారు. తాజాగా బ్యాంక్ బజార్.కామ్ ఈ రిపోర్టును వెల్లడించింది.  పర్సనల్ లోన్ లోనూ బెంగళూరు వాసులదే పైచేయి. ముంబైలో పర్సనల్ లోన్ సైజు 26.6లక్షలుంటే బెంగళూరులో ఏకంగా 34 లక్షలుండడం విశేషం.

సాఫ్ట్ వేరర్లు ఇలా హోమ్ - పర్సనల్ లోన్లు తీసుకోవడం పెట్టుబడులు పెట్టడంతో బెంగళూరులో ధరలు ఏకంగా 11శాతం పెరగడం విశేషం. ఆదాయపు పన్నులు తగ్గించుకోవడానికి ఇలా బెంగళూరు వాసులు అక్కడ ఇబ్బడిముబ్బడిగా ఇండ్లు కార్లు కొనేస్తున్నారట.. అందుకే బెంగళూరులో ఇప్పుడు ఇండ్లు ఫ్లాట్ల ధరలు చుక్కలనంటుతున్నాయట..