పూరీని బండ్లన్న అంత మాటన్నాడేంటీ బాసూ?

Fri Sep 30 2022 22:53:27 GMT+0530 (India Standard Time)

Bandla Ganesh High voltage Interview PROMO

వెర్సటైల్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై నటుడు నిర్మాత బండ్ల గణేష్ మళ్లీ విరుచుకుపడ్డారు. భార్యా బిడ్డలను ప్రేమించనోడు మనిషా? అంటూ ఘాటుగా స్పందించాడు. ఓ యూట్యూబ్ ఛానల్ కు ప్రత్యేకంగా ఇచ్చిన ఇంటర్వ్యూలో బండ్ల గణేష్ పై విధంగా దర్శకుడు పూరి జగన్నాథ్ పై విరుజుకుపడటం పలువురిని ఆశ్చర్యానికి గురిచేస్తోంది. బండ్ల గణేష్ కు ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారింది.  వ్యాపారాలు వ్యాపకాలు వంద ఉన్నాయి. వాటిని పక్కన పెట్టి రాజకీయాల్లో ఎందుకు వేలు పెడుతున్నారు? అని అడిగితే.. తాను ఎ్కడ వేలు పెట్టానని రివర్స్ ప్రశ్నించారు. ఇదే ఇంటర్వ్యూలో నటుడు రచయిత పోసాని కృష్ణమురళిపై కూడా సంచలన ఆరోపణలు చేసినట్టుగా తెలుస్తోంది. పోసాని చావు మామూలుగా వుండదని ఆ పదాలని వీడియో నుంచి తొలగిస్తే బాగుండదని బండ్లన్న యాంకర్ తో గొడవకు దిగిన తీరు మరింత ఆసక్తిని రేకెత్తిస్తోంది.

అలాగే యాంకర్ అడిగిన ఓ ప్రశ్నకు బండ్ల గణేష్ సమాధానం చెబుతూ `అన్న నువ్వు పెట్టే బోనులో పడే ఎలుకలు చాలా ఉంటాయి. కానీ బండ్ల గణేష్ పడడు.. కేటీఆర్ గారు అంటే ఆన్సర్ ఇస్తా.. మెగా ఫ్యామిలీ అంటే ఆన్సర్ ఇస్తా.. పోసాని అంటే ఆన్సర్ ఇస్తా.. తీకులు పెడితే చెప్పను.. అంటూ యాంకర్ పై ఫైర్ అయ్యాడు బండ్ల గణేష్. ఇదే సందర్భంగా తనని ఉద్దేశించి ఇండైరెక్ట్ గా పూరీ జగన్నాథ్ చేసిన వ్యాఖ్యలను ప్రస్తావించగా `భార్యను బిడ్డలను ప్రేమించనోడు మనిషా అన్న `అంటూ బండ్ల గణేష్ ఫైర్ అయ్యారు.

అంతే కాకుండా పూరీ అనేవాడికి మంచి చెడు చెప్పే హక్కు తపకు ఉందని... అతను తన ఫ్రెండ్ అని చెప్పుకొచ్చాడు. మా ఎన్నికల సమయంలో కోట శ్రీనివాసరావును నాగబాబు విమర్శించారు. దీన్ని మీరు సమర్థిస్తారా? వ‌్యతలిరేకిస్తారా..? అని అడిగితే తనని ఇరికించే ప్రయత్నం చేయొద్దని బండ్ల గణేష్ చెప్పడం గమనార్హం. ప్రస్తుతం ఈ ఇంటర్వ్యూకు సంబంధించిన ప్రోమో ప్రస్తుతం నెట్టింట వైరల్ గా మారి సందడి చేస్తోంది. పూర్తి ఇంటర్వ్యూ రిలీజ్ అయితే పూరి పోసాని నాగబాబు బండ్లన్నపై ఎలా స్పందిస్తారో చూడాలి అని ఇండస్ట్రీ జనం అంటున్నారు.

గతంలో ఆకాష్ పూరి నటించిన `చోర్ బజార్` ఫంక్షన్ లో బండ్ల గణేష్ .. పూరీని ఉద్దేశించి సంచలన వ్యాఖ్యలు చేయడం.. దానికి పూరి సున్నితంగానే చురకలు అంటించడం తెలిసిందే. బండ్ల గణేష్ నోరు అదుపులో పెట్టుకుంటే మంచిది అంటూ ఓ విధంగా పూరి జగన్నాథ్ ఇండైరెక్ట్ గా వార్నింగ్ ఇవ్వడం అప్పట్లో హాట్ టాపిక్ గా మారింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.