Begin typing your search above and press return to search.

ప్లీజ్ .. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి: సంజ‌య్ విన‌తి

By:  Tupaki Desk   |   15 May 2022 4:30 AM GMT
ప్లీజ్ .. బీజేపీకి ఒక్క ఛాన్స్ ఇవ్వండి:  సంజ‌య్ విన‌తి
X
అప్పుడెప్పుడో.. ఏపీలో విన్న `ఒక్క ఛాన్స్ ప్లీజ్‌` అనే మాట తాజాగా తెలంగాణ‌లో నూ వినిపించింది. తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజ‌య్ ప్ర‌జ‌ల‌కు ఒక్క ఛాన్స్ ప్లీజ్ అంటూ విజ్ఞ‌ప్తి చేశారు. ``ప్లీజ్.. బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వండి`` అని ఆయ‌న అభ్య‌ర్థించారు. తుక్కుగూడలో పాద‌యాత్ర ముగింపు సంద‌ర్భంగా నిర్వ‌హించిన స‌భ‌లో సంజ‌య్ మాట్లాడుతూ.. బీజేపీ అధికారంలోకి వస్తే పెట్రోల్‌ డీజిల్‌పై వ్యాట్ తగ్గిస్తామ‌న్నారు. నిజాం సమాధికి మోకరిల్లే వాడికి ఈ గడ్డపై స్థానం లేదన్నారు. టీఆర్ ఎస్‌, ఎంఐఎం, కాంగ్రెస్‌ నాటకాలు ఆడుతున్నాయని మండిప‌డ్డారు.

కాంగ్రెస్‌కు ఓటు వేస్తే.. కేసీఆర్‌కు, టీఆర్ ఎస్‌కు వేసినట్లేన‌ని బండి సంజయ్ వ్యాఖ్యానించారు. తెలంగాణలో కుటుంబ పాలనను అంతమొందించాల‌ని పిలుపునిచ్చారు. ఈ నేప‌థ్యంలోనే బీజేపీకి ఒక్క అవకాశం ఇవ్వాలని విజ్ఞప్తి చేస్తున్నాన‌ని అన్నారు. ధర ణి పేరుతో ప్రజల భూములను టీఆర్ ఎస్‌ నేతలు లాక్కున్నారని మండిప‌డ్డారు. గోల్కొండ ఖిల్లా మీద కాషాయ జెండా ఎగరేయాలని పార్టీ నేత‌ల‌కు ఆయ‌న పిలుపునిచ్చారు. కేసీఆర్‌ కుటుంబ పాలనను అంతం చేసేందుకే అమిత్ షా వచ్చారని తెలిపారు. ప్రజాసంగ్రామ యాత్ర సమన్వయకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు.

త‌న పాదయాత్రలో ప్రజలు ఎన్నో సమస్యలను నాకు మొరపెట్టుకున్నారని సంజ‌య్ అన్నారు. అధికార మార్పు జరగాలని ప్రజలు భావిస్తున్నారని తెలిపారు. ధరణి పేరుతో ప్రజల భూములను నేతలు లాక్కున్నారని అన్నారు. కుటుంబ పాలన వల్ల శ్రీలంకలో వచ్చిన పరిస్థితులు చూశామ‌ని, ఇక్క‌డ టీఆర్ ఎస్‌కుటుంబ పాల‌న‌తో అదే ప‌రిస్థితి వ‌చ్చే అవ‌కాశం ఉంద‌ని హెచ్చ‌రించారు. కీలక శాఖలన్నీ కేసీఆర్‌, కుటుంబ సభ్యుల వద్దే ఉన్నాయ‌ని విమ‌ర్శించారు.

పాలమూరు ప్రజలు ఇంకా ఎడారి పరిస్థితుల్లోనే ఉన్నారని సంజ‌య్ ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఆర్డీఎస్‌ను పూర్తి చేసే బాధ్యత బీజేపీదేన‌ని చెప్పారు. కేసీఆర్‌కు ఎత్తిపోతల ప్రాజెక్టులంటేనే ఇష్టమ‌ని, దానిని ఆయ‌న వ‌ద‌ల‌ర‌ని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌ ప్రతి నియోజకవర్గంలో లక్ష ఎకరాలకు నీరు ఇస్తానన్నారని, మ‌రి నీరు ఇచ్చారా? అని ప్ర‌శ్నించారు.. ``ఒకసారి వరి వద్దంటారు, ఒకసారి పత్తి వద్దంటారు. తుగ్లక్‌ నిర్ణయాలతో రాష్ట్రాన్ని భ్రష్టు పట్టించారు`` అని బండి సంజయ్ విరుచుకుప‌డ్డారు.