కేసీఆర్ తో ఎలా సినిమా తీస్తే లాభమో చెప్పిన బండి

Mon Jan 25 2021 13:20:14 GMT+0530 (IST)

Bandi Sanjay Fires On Cm Kcr

పదునైన విమర్శలు.. వెనుకా ముందు చూసుకోకుండా గులాబీ బాస్ ను దులిపేసే విషయంలో తెలంగాణ రాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ముందుంటారని చెప్పాలి. ఇటీవల కాలంలో ఆయన సీఎం కేసీఆర్ ను పెట్టి సినిమా తీయాలనే మాటను తరచూ చెబుతున్నారు. మొన్నటికి మొన్న దర్శకేంద్రుడు రాఘవేంద్రరావును తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ను పెట్టి సినిమా తీయాలని కోరారు.తన మానాన తాను బతుకుతున్న దర్శకేంద్రుడికి కొత్త టెన్షన్ పెట్టిన బండి సంజయ్.. తాజాగా మరోసారి కేసీఆర్ సినిమా ప్రస్తావనను తెచ్చారు. ఈసారి దర్శకేంద్రుడ్ని వదిలి.. తెలుగు సినిమా దర్శకుల్ని సినిమా తీయాలని కోరారు. నమ్మించి మోసం చేయటంలో ముఖ్యమంత్రి కేసీఆర్ గొప్ప నటులని.. ఆయనో జోకర్అని చెప్పారు.

కేసీఆర్ తో సినిమా ఎలా తీయాలి? ఎలా తీస్తే భారీ లాభాల్ని సొంతం చేసుకోవచ్చో వివరించిన బండి వ్యాఖ్యలు ఆసక్తికరంగా మారాయి. కేసీఆర్ తో 24 గంటల్లో సినిమా తీస్తే ఖర్చు తక్కువని.. హౌస్ పుల్ కలెక్షన్లు వస్తాయన్నారు. దయచేసి కేసీఆర్ కు నటించే అవకాశం ఇవ్వాలన్నారు. పదే పదే కేసీఆర్ తో సినిమా తీయాలన్న బండి మాటను తెలుగు దర్శకులు పరిగణలోకి తీసుకొని.. కాస్త స్పందిస్తే అయినా ఆయన తన సినిమా మాటల్ని ఆపుతారేమో?