Begin typing your search above and press return to search.

వరద బాధితులకు బాలయ్య 1.50 కోట్ల సాయం.. ఫేక్ న్యూస్

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:30 AM GMT
వరద బాధితులకు బాలయ్య 1.50 కోట్ల సాయం.. ఫేక్ న్యూస్
X
సోషల్ మీడియా అత్యంత యాక్టివ్ గా ఉన్నాక ఏది అసలు వార్త.. ఏది నకిలీ వార్త అనేది తెలుసుకోవడం చాలా కష్టమవుతోంది. దీనివల్ల కొందరు సెలెబ్రెటీలు ఇబ్బందులు పడుతున్నారు. వారి పరువు ప్రతిష్టలకు కూడా భంగం కలుగుతోంది. సాయం చేస్తే ఒక బాధ.. చేయకపోతే విమర్శలు కొనితెచ్చుకోవాల్సిన పరిస్థితులు సోషల్ మీడియా వల్ల దాపురించాయి.

ఇటీవల భారీ వర్షాలకు హైదరాబాద్ నిండా మునిగిన సంగతి తెలిసిందే. హైదరాబాద్‌లో వరద బాధితుల శ్రేయస్సు కోసం ప్రముఖ టాలీవుడ్ హీరో, ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ రూ .1.50 కోట్లు విరాళంగా ఇచ్చినట్లు సోషల్ మీడియాలో వార్తలు వెల్లువెత్తాయి. దీని ఆధారంగా పలు మీడియా చానెల్స్, వెబ్ సైట్లు కూడా గొప్పగా ఫోకస్ చేశాయి. బాలయ్య అభిమానులు అయితే దీనిని నమ్ముతూ పెద్ద హంగామా చేయడం ప్రారంభించారు.

కానీ విషయం ఏమిటంటే.. బాలయ్య వరద బాధితులకు ఇప్పటివరకు ఎలాంటి విరాళం చేయలేదని సమాచారం. ఈ గాసిప్ బలయ్యను తీవ్రంగా ఇబ్బందుల్లో పడేసింది. ఎందుకంటే అతను బహిరంగంగా దీనిపై నిజం చెప్పలేని పరిస్థితి నెలకొంది. అందుకే ఈ అవాంఛిత ప్రశంసలను నిశ్శబ్దంగా ఆస్వాదించలేకపోతున్నట్టు టాలీవుడ్ సమాచారం..

ఈ గాసిప్ ఎవరు ప్రారంభించారో ఎవరికీ తెలియదు. నటుడి ఇమేజ్‌ను ఇబ్బందికరమైన స్థితిలో నెట్టడానికి కొందరు వ్యతిరేక అభిమానులు ఈ గాసిప్‌ను పుట్టించారని చాలా మంది నమ్ముతున్నారు. కోవిడ్ విరాళాల సమయంలో కూడా బాలయ్య నిజంగా ఏదో దానం చేయడానికి ముందే ఆయన పేరును..ఇన్ని కోట్లు విరాళం ఇచ్చాడంటూ చాలామంది ప్రచారం చేసి ఇబ్బందుల్లోకి నెట్టారు. అప్పుడు కూడా బాలయ్య ఇబ్బందులు పడ్డారు.

వాస్తవానికి, హీరోలు ఇలాంటి గాసిప్‌గా చెలామణి అవుతున్న వార్తలను నిజం చేయడానికి కొందరు తప్పనిసరి పరిస్థితుల్లో విరాళాలు చేయాల్సిన పరిస్థితులు నెలకొంటున్నాయి.. మరికొందరు ఇబ్బంది పడకుండా మౌనంగా ఉంటున్నారు. మొత్తానికి ప్రముఖులను ఇబ్బందులు పెట్టేలా సోషల్ మీడియా తయారైందనే చెప్పవచ్చు.