Begin typing your search above and press return to search.

హైదరాబాదీయులు వావ్ అనుకునే న్యూస్.. మూడేళ్లు తర్వాత రియాలిటీలోకి!

By:  Tupaki Desk   |   29 Nov 2022 4:42 AM GMT
హైదరాబాదీయులు వావ్ అనుకునే న్యూస్.. మూడేళ్లు తర్వాత రియాలిటీలోకి!
X
ఏళ్లకు ఏళ్లుగా ఎదురుచూస్తున్న మెట్రో ఫేజ్ 2కు బీజం పడింది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఎవరి మీదనో ఆధారపడకుండా తనకు తానుగా.. సొంత నిధులతో మెట్రో ఫేజ్ 2 ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టటం.. త్వరలో శంకుస్థాపన కార్యక్రమాన్ని చేపట్టనున్న విషయం తెలిసిందే. 31 కిలోమీటర్ల నిడివి ఉండే ఈ ట్రాక్ రాయదుర్గం స్టేషన్ వద్ద నుంచి శంషాబాద్ ఎయిర్ పోర్టు వరకు సాగనుంది.

ఇప్పటికే రాయదుర్గం వద్ద మెట్రో స్టేషన్ ఉండటం తెలిసిందే. ఫేజ్ 2 కోసం.. ఇప్పుడున్న స్టేషన్ పక్కనే మరో స్టేషన్ (మెట్రో ఎక్స్ ప్రెస్)ను నిర్మించనున్నారు. ఈ స్టేషన్ నుంచి ఆ స్టేషన్ కు.. ఆ స్టేషన్ నుంచి ఈ స్టేషన్ కు రాకపోకలు సాగించే వీలుగా నిర్మిస్తారు.

హైదరాబాదీయులకు ఆనందాన్ని కలిగించే అంశం ఏమంటే.. ఫేజ్ 2 పూర్తి అయిపోతే.. ఎంచక్కా రాయదుర్గం నుంచి వెళ్లిపోవచ్చు. విమాన ప్రయాణం అన్నంతనే బోలెడంత లగేజ్ వెంట పెట్టుకోవటంచూస్తాం. మరి.. ఇంత లగేజ్ పట్టుకొని మెట్రో ఎక్కి.. ఎయిర్ పోర్టులో దిగి వెళ్లటం చాలా కష్ట సాధ్యం. అందుకే.. అలాంటి ఇబ్బందులకు చెక్ పెట్టేలా ఫేజ్ 2ను ప్లాన్ చేశారు.

శంషాబాద్ ఎయిర్ పోర్టుకు వెళ్లే ప్రయాణికులు రాయదుర్గం మెట్రో ఎక్స్ ప్రెస్ స్టేషన్ కు వెళ్లినంతనే.. వారి నుంచి విమాన ప్రయాణానికి తీసుకెళ్లే లగేజ్ కౌంటర్ ను ఏర్పాటు చేస్తారు. ఎలా అయితే ఎయిర్ పోర్టులో ఆయా ఎయిర్ లైన్స్ సంస్థల వారి చెకిన్ కౌంటర్లు ఉంటాయో.. కొత్తగా నిర్మించే స్టేషన్ లో వాటిని నిర్మిస్తారు. అక్కడ లగేజ్ ను చెకిన్ చేసుకున్న తర్వాత.. వాటిని విడిగా మెట్రో రైళ్లలో ఎయిర్ పోర్టుకు పంపుతారు. అంటే.. మెట్రో ఎక్కే ప్రయాణికులకు లగేజ్ చెకిన్ రాయదుర్గం మెట్రో ఎక్స్ ప్రెస్ స్టేషన్ లోనే అయిపోతుందన్న మాట.

దీంతో.. లగేజ్ మొత్తాన్ని రైల్వే స్టేషన్ లోనే అప్పజెప్పేసి.. ఎంచక్కా ఎయిర్ పోర్టుకు హ్యాండ్ లగేజ్ తో వెళ్లే వీలుంటుంది. దీంతో.. ఎయిర్ పోర్టుకు కార్లలో ప్రయాణించే బాధ తగ్గుతుంది. ప్రయాణ సమయం కూడా తగ్గే వీలుంది.

ఇప్పటికే ఈ మోడల్ ను హాంకాంగ్ మెట్రోలో అమలు చేస్తున్నారు. ఇదే విధంగా ప్రపంచ స్థాయి మహానగరాల్లోని మెట్రోలను క్షుణ్ణంగా పరిశీలించి.. అక్కడ అమలు చేస్తున్న మేలైన విధానాల్ని స్ఫూర్తిగా తీసుకొని.. హైదరాబాద్ మెట్రోలో అమలు చేసేందుకు సిద్ధమవుతున్నారు. హైదరాబాదీయులకు ఇంతకు మించిన గుడ్ న్యూస్ ఇంకేం ఉంటుంది చెప్పండి?



నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.