Begin typing your search above and press return to search.

WTC Final: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్

By:  Tupaki Desk   |   18 Jun 2021 6:10 PM GMT
WTC Final: క్రికెట్ ఫ్యాన్స్ కు బ్యాడ్ న్యూస్
X
ప్రపంచ తొలి టెస్ట్ చాంపియన్ షిప్ వర్షార్పణం అయ్యేలా కనిపిస్తోంది. ఇప్పటికే తొలిరోజు కనీసం టాస్ కూడా పడకుండానే మ్యాచ్ రద్దు కావడం క్రికెట్ ఫ్యాన్స్ ను తట్టుకోలేకుండా చేస్తోంది. జూన్ లో ఇంగ్లండ్ లో వానలు పడుతాయని తెలిసి కూడా ఐసీసీ ఈ ప్రతిష్టాత్మక ఫైనల్ ను ఇంగ్లండ్ లో నిర్వహించడంపై క్రికెట్ ఫ్యాన్స్ 'ఐసీసీ'ని ట్రోల్స్ చేస్తున్నారు. మీమ్స్ తో ఐసీసీ ట్విట్టర్ ఖాతాను చెడుగుడు ఆడుతున్నారు.

ప్రపంచవ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూసిన టెస్ట్ ఫైనల్ కనీసం టాస్ కూడా వేయకుండా బోరు వర్షంతో తొలి రోజు ఆట రద్దు అవడంతో అభిమానులు నిరాశపడుతున్నారు. మధ్యాహ్నం 1 గంట వరకు వర్షం తెరిపినిచ్చింది. కానీ మైదానం ఔట్ ఫీల్డ్ చిత్తడిగా మారడంతో నిండుకుండలా నీటితో స్టేడియం నిండింది. రేపు కూడా మ్యాచ్ నిర్వహణ అసాధ్యంగా కనిపిస్తోంది.

ఇక బ్రిటన్ వాతావరణ శాఖ తాజాగా బాంబ్ పేల్చింది. సౌథాంప్టన్ లో వచ్చే వారం రోజుల పాటు భారీ వర్షాలు పడుతాయని బ్రిటన్ మెట్రలాజికల్ డిపార్ట్ మెంట్ హెచ్చరించింది. ఈ మేరకు ఎల్లో వెదర్ వార్నింగ్ ను జారీ చేసింది. ఎల్లో వెదర్ వార్నింగ్ అంటే 'ఉరుములు, మెరుపులతో కూడిన వర్షపాతం' నమోదవుతుందని వాతావరణ శాఖ హెచ్చరించింది.

ప్రపంచ టెస్ట్ చాంపియన్ షిప్ జరిగే వారం రోజులు ఓ మోస్తారు నుంచి అతి భారీ, వర్షాలు పడుతాయని వాతావరణ శాఖ తెలిపింది. దీంతో క్రికెట్ అభిమానులు షాక్ అవుతున్నారు. వర్షం పూర్తిగా తెరిపినిచ్చినా కూడా గ్రౌండ్ ను క్లియర్ చేయడానికి చాలా సమయం పడుతుంది. ఈ నేపథ్యంలో వారం పాటు వర్ష సూచన ఉండడంతో ఈ ఫైనల్ మ్యాచ్ జరగడం అనుమానంగానే కనిపిస్తోందని అంటున్నారు.