Begin typing your search above and press return to search.

భారీ భూకంపంలోనూ ఈ ‘మిరాకిల్’ జరిగింది

By:  Tupaki Desk   |   7 Feb 2023 7:07 PM GMT
భారీ భూకంపంలోనూ ఈ ‘మిరాకిల్’ జరిగింది
X
టర్కీ, సిరియాలను భారీ భూకంపం కుదిపేసింది. అయితే ఈ భారీ భూకంపంలో పేకమేడల ఇళ్లు కుప్పకూలిపోయాయి. ఈ రెండు దేశాలను తీవ్ర విషాదంలోకి నెట్టాయి. ఎంతో మంది ఏం జరుగుతుందో తెలుసుకునేలోపే ప్రాణాలు కోల్పోయారు. ఇతటి విషాదంలోనూ సిరియాలో ఓ ‘మిరాకిల్’ జరిగింది. శిథిలాల కింద ఇరుక్కుపోయిన ఓ గర్భిణి మగబిడ్డకు జన్మనిచ్చింది. పసికందును వెలికి తీసిన స్థానికులు ఆ మృత్యుంజయుడికి ‘మిరాకిల్’ అద్భుతం అని పేరు పెట్టారు. అయితే దురదృష్టవశాత్తూ ఆ తల్లి జన్మనిచ్చిన వెంటనే ప్రాణాలు కోల్పోయింది.

ఈశాన్య సిరియాలోని ఆఫ్రిన్ గ్రామీణ ప్రాంతంలోని జెండెరెస్‌లో భారీ రెస్క్యూ ఆపరేషన్ జరిగింది. అయితే విషాదకరంగా ఘటనలో ఓ గర్భిణి బిడ్డను కని చనిపోయింది.ఆ తల్లిదండ్రులు భూకంపం తాకిడి నుంచి బయటపడలేదు.ఇద్దరూ మరణించారు. ఆ పసిబిడ్డ మాత్రం బతికి బట్టకట్టడం అద్భుతంగా చెప్పవచ్చు.

సోమవారం తెల్లవారుజామున 7.8 తీవ్రతతో సంభవించిన భూకంపంతో అతలాకుతలమైన టర్కీ మరియు సిరియా ప్రాంతాన్ని చీకటి, వర్షం మరియు చలి చుట్టుముట్టడంతో సహాయక చర్యలకు ఆటంకం కలిగింది. దీంతో వేలాది రెస్క్యూ ఆపరేషన్లలో ఒక అప్పుడే పుట్టిన బిడ్డ కేకలు విని సహాయక చర్యలు చేపట్టారు. ఆ శిశువును వెలికితీశారు.

నవజాత శిశువు మాత్రమే శిథిలాల కింద బయటపడింది. వారి కుటుంబం మొత్తం మరణించారు. ఇప్పటికే సిరియా యొక్క క్రూరమైన యుద్ధంలో డెయిర్ ఎజోర్ నుండి వలసవచ్చిన వీరు అఫ్రిన్ లో తలదాచుకోగా.. ఇప్పుడు భూకంపంతో చనిపోవడం విషాదం నింపింది.

ఈ శతాబ్దంలో సంభవించిన అత్యంత ఘోరమైన ప్రకృతి వైపరీత్యాలలో టర్కీ-సిరియా భూకంపం నిలిచింది. ఈ భూకంపంలో 5,000 మందికి పైగా మరణించారు. వందలాది భవనాలు నేలమట్టం అయ్యాయి.

తొలుత స్థానిక కాలమానం ప్రకారం సోమవారం మధ్యాహ్నం 7.7 తీవ్రతతో మరో భూకంపం సంభవించింది. ఈరోజు, తూర్పు టర్కీలో మూడవసారి 5.7 భూకంపం సంభవించింది. రెస్యూ సిబ్బంది చేతులతో శిథిలాల గుండా త్రవ్వుతున్నారు.

టర్కీ వైస్ ప్రెసిడెంట్ ఫుట్ ఆక్టే భూకంపాన్ని "శతాబ్దపు విపత్తు" గా అభివర్ణించారు. మరణాల సంఖ్య 5,000 కి చేరుకుంది.

యూకేతో సహా భూకంపంలో సహాయం చేయడానికి డజన్ల కొద్దీ దేశాలు రెస్క్యూ బృందాలను పంపాయి. అయితే ప్రాణాలతో బయటపడిన వారిని కనుగొనే ప్రయత్నాలు మాత్రం ఇప్పటికే ముగిశాయని నిపుణులు హెచ్చరించారు.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.