Begin typing your search above and press return to search.

పవన్ పై బాబు గోగినేని సెటైర్.. నాగబాబు ఫైర్

By:  Tupaki Desk   |   18 April 2021 3:38 AM GMT
పవన్ పై బాబు గోగినేని సెటైర్.. నాగబాబు ఫైర్
X
జనసేన పార్టీ అధినేత.. పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ప్రస్తుతం కరోనా సోకి చికిత్స తీసుకుంటున్న సంగతి తెలిసిందే. పవన్ ఫాం హౌస్ లోనే అపోలో వైద్యుల పర్యవేక్షణలో చికిత్స పొందుతున్నారు. పవన్ కు చికిత్స పొందుతున్న ఫొటో ఒకటి బయటకు వచ్చింది.

దీంతో పవన్ అభిమానులు.. టాలీవుడ్ సినీ ప్రముఖులు అంతా పవన్ కళ్యాణ్ త్వరగా కోలుకోవాలని కోరుకుంటూ పోస్టులు పెడుతున్నారు.

కాగా ఓ అభిమాని పవన్ కళ్యాణ్ ను స్వామీ వివేకానంద, చేగువేరా పరామర్శించడానికి వచ్చినట్లుగా ఆ ఫొటోని మార్ఫింగ్ చేశాడు. ఈ ఫొటోను పవన్ ఫ్యాన్స్ పెద్దఎత్తున షేర్ చేయడంతో వైరల్ గా మారింది.

ఈ ఫొటోపై ప్రముఖ హేతువాది బాబు గోగినేని స్పందించారు. ఈ ఫొటోని షేర్ చేసిన ఆయన ఈ ఫొటో కార్టూన్ లా ఉందని సెటైర్ వేశారు. దీంతో పవన్ అభిమానులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ ఇంకోసారి తమ హీరో గురించి ఇలాంటి పోస్ట్ పెడితే ఊరుకోబోమని హెచ్చరిస్తూ పోస్టులు పెడుతున్నారు. ఈ పోస్టును నాగబాబుకు షేర్ చేశారు.

దీనిపై నాగబాబు ఘాటుగా స్పందించారు. బాబు గోగినేనిపై కౌంటర్ వేశారు. ‘నాకు ఇలాంటివి ఫార్మర్డ్ చేయకండయ్యా.. నాకు కేవలం పెంపుడు కుక్కలు అంటేనే ఇష్టం. బాబు గోగినేని అంటే కాదు’ అంటూ నాగబాబు పోస్ట్ పెట్టారు.గోగినేనిని ఉద్దేశించి నాగబాబు అన్న కామెంట్ వైరల్ గా మారింది.