బాబా వంగా భవిష్యవాణి.. ప్రపంచానికి ముప్పు తప్పదా? 2023.. యుగాంతమేనా?

Sun Sep 25 2022 11:41:44 GMT+0530 (India Standard Time)

Baba Vanga Predictions

యుగాంతం ఎప్పుడు అవుతుంది?.. ఈ ప్రపంచం ఎప్పుడు అంతమవుతుంది.. ఇలాంటివాటిపై అందరికీ ఆసక్తే. గతంలో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నోస్ట్రడామస్ వంటి వారు భవిష్యత్‌లో జరగబోయే పరిణామాలు వింతలు విశేషాలపై అనేక విషయాల గురించి రాశారు.. అలాగే చెప్పారు. పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి కాలజ్ఞానం ఎంత పాపులరో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.బ్రహ్మంగారు నోస్ట్రడామస్ మాదిరిగానే బాబా వంగా కూడా భవిష్య వాణి చెప్పడంలో చాలా పాపులర్. బల్గేరియా దేశానికి చెందిన బాబా వంగా 1911లో జన్మించి 1996లో మృతి చెందారు. ఆమె భవిష్యత్‌లో జరగబోయే ఎన్నో విషయాలు గురించి చెప్పారని.. వాటిలో చాలా వరకు నిజమయ్యాయని అంటున్నారు.

కాగా 2023 సంవత్సరంలో జరగబోయే అనేక సంఘటలను గురించి కూడా బాబా వంగా చెప్పారని అంటున్నారు. మరో మూడు నెలల్లో 2022 ముగియనుంది. 2023 వస్తుంది. ఈ నేపథ్యంలో బాబా వంగా 2023 గురించి గతంలో చెప్పిన విషయాలు అందరిలో గుబులు రేబుతున్నాయి. 2023కి సంబంధించి బాబా వంగా చెప్పిన అంశాలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

కాగా బాబా వంగా జీవ ఆయుధాలు (బయో వెపన్స్) గురించి తన భవిష్యవాణిలో చెప్పారని అంటున్నారు. ఈ జీవ ఆయుధాలపై ప్రయోగాలు చేస్తున్న ఒక పెద్ద దేశం కారణంగా ప్రపంచవ్యాప్తంగా వేలాది మంది ప్రజలు మరణిస్తారని వంగా బాబా పేర్కొనడం సంచలనం సృష్టిస్తోంది. దీంతో ఇప్పుడు ఆ పెద్ద దేశం అమెరికానా లేక చైనానా అనేదానిపై ఊహాగానాలు చెలరేగుతున్నాయి.

గతంలో చైనాలోని వూహాన్‌లోని ఒక ల్యాబ్ నుంచి పుట్టుకొచ్చిన కరోనా వైరస్ ప్రపంచ దేశాల్లో పెను విధ్వంసం సృష్టించిన సంగతి తెలిసిందే. కోట్ల మంది ప్రజలు కరోనా బారినపడ్డారు. కొన్ని లక్షల మంది మరణించారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు జీవాయుధాలు (బయో వెపన్స్) గురించి వంగా బాబా చెప్పిన అంశాలు అందరిని ఆందోళనకు గురి చేస్తున్నాయి.

అలాగే 2023లో అణు ప్లాంట్‌ల విస్పోటనాలు భారీగా జరిగే అవకాశం ఉందని బాబా వంగా తన భవిష్య వాణిలో తెలిపారని అంటున్నారు. ఇప్పటికే ఉక్రెయిన్ రష్యా యుద్ధం అణు ప్లాంట్‌ల భద్రతపై భయాందోళనలు రేకెత్తించిన సంగతి తెలిసిందే. ఉక్రెయిన్లో ఉన్న అతిపెద్ద అణు విద్యుత్ ప్లాంటును రష్యా పేల్చేస్తుందనే వార్తలు వచ్చాయి.

ఇక అన్నింటికంటే ముఖ్యంగా 2023లో భూమి కక్ష్య మారిపోతుందని బాబా వంగా తన కాలజ్ఞానంలో తెలిపారు. ఇప్పటికే భూమి కక్ష్య మార్పుపై శాస్త్రవేత్తలు అనేక అంచనాలు వివరణలు ఇస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో వంగా బాబా చెప్పినట్టు భూమి కక్ష్య మారిపోతే సృష్టి విశానం తప్పదని అంటున్నారు.

అలాగే 2023లో భారీ సౌర తుపాను విరుచుకుపడుతుందని బాబా వంగా జోస్యం చెప్పారు. ఈ సౌర తుపాను దాటికి కమ్యూనికేషన్ వ్యవస్థలు (ఫోన్లు ఇంటర్నెట్ వ్యవస్థలు) పూర్తిగా స్తంభించిపోతాయని చెబుతున్నారు.

కాగా గతంలో అంటే 2022కు సంబంధించి బాబా వంగా 2022లో గతంలో చెప్పిన చాలా విషయాలు నిజం కావడం గమనార్హం. ఆస్ట్రేలియాలో కొన్ని ప్రాంతాల్లో గణనీయమైన వరదలు సంభవిస్తాయని ఆమె గతంలో తెలిపారు. ఆమె ఊహించినట్టుగానే 2022 ప్రారంభంలో ఆస్ట్రేలియాలో భారీ వర్షాలతో వరదలు విలయం సృష్టించాయి. అలాగే మరికొన్ని ప్రాంతాల్లో తీవ్ర కరువు విజృంభిస్తుందని కూడా వంగా బాబా చెప్పారు. ఇది కూడా నిజమైంది. ఈ ఏడాది యూరప్‌తో పాటు కొన్ని దేశాల్లో కరువు విలయతాండవం చేసింది.