Begin typing your search above and press return to search.

ఆరెస్సెస్ పై బాహుబ‌లి రైట‌ర్ సినిమా!

By:  Tupaki Desk   |   17 Aug 2022 7:32 AM GMT
ఆరెస్సెస్ పై  బాహుబ‌లి రైట‌ర్ సినిమా!
X
జ‌క్క‌న్న తెర‌కెక్కించిన 'బాహుబ‌లి' సిరీస్ చిత్రాల‌తో ర‌చ‌యిత‌గా వి. విజయేంద్ర ప్ర‌సాద్ దేశ వ్యాప్తంగా భారీ క్ర‌నేజ్ ని సంతం చేసుకున్నారు. బాలీవుడ్ మూవీ 'బ‌జ‌రంగీ భాయిజాన్‌'తో బాలీవుడ్ లోనూ త‌న‌దైన ముద్ర వేసి ఇండియా వైడ్ గా హాట్ టాపిక్ అయ్యారు. క్ర‌మ క్ర‌మంగా బీజేపీ భావ‌జాలానికి, బీజేపీ పార్టీకి ద‌గ్గ‌రైన ఆయ‌న ఇటీవ‌ల మ‌హాత్మా గాంధీ, జిన్నాల‌పై సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేయ‌డం ప‌లువురిని ఆశ్చ‌ర్యానికి గురిచేసింది.

ఆరెస్సెస్ భావాల‌ని కూడా ప్ర‌ముఖంగా వెల్ల‌డించ‌డంతో విజ‌యేంద్ర‌ప్ర‌సాద్ వ్యాఖ్య‌లు చ‌ర్చ‌నీయాంశంగా మారాయి. ఇదిలా వుంటే తాజాగా ఆయ‌న బీజేపీ త‌రుపుని రాజ్క‌ స‌భ‌కు ఎంపీగా నామినేట్ అయిన విష‌యం తెలిసిందే. చెన్నై నుంచి రాజ్య సభ్యుడిగా బీజేపీ త‌రుపున నామినేట్ అయిన ఆయ‌న జూలై 7న ప్ర‌మాణ స్వీకారం చేశారు. ప్ర‌స్తుతం రాజ్య స‌భ స‌భ్యుడి హోదాలో విజ‌యేంద్ర ప్ర‌సాద్ 'ది హిందుత్వ పార‌డైం' పుస్తాకావిష్క‌ర‌ణ‌లో పాల్గొన్నారు.

ఈ సంద‌ర్భంగా ప‌లు ఆస‌క్తిక‌ర విష‌యాల్ని వెల్ల‌డించారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న మాట్లాడుతూ ' నేను రాసే క‌థ‌లు తీయ‌టి అబ‌ద్దాల‌న్నారు. విన్న క‌థ‌ల‌న్నీ నిజం కావు. కొన్ని క‌థ‌లు మాత్రం నిజం అవుతాయి. మంగ‌ళ‌వారం విజ‌య‌వాడ‌లోని సిద్ధార్థ ఫార్మ‌సీ క‌ళాశాల‌లో జ‌రిగిన 'ది హిందుత్వ పార‌డైం' పుస్తకావిష్క‌ర‌ణ‌లో విజ‌యేంద్ర ప్ర‌సాద్ పాల్గొన్నారు.

పుస్త‌కావిష్క‌ర‌ణ అనంత‌రం ఆయ‌న మాట్లాడుతూ ' నాలుగేళ్ల క్రితం ఆరెస్సెస్ మీద క‌థ రాయ‌మ‌ని అడిగిన‌ప్పుడు అందు కోసం తాను నాగ్ పూర్ వెళ్లాన‌న్నారు.

అప్ప‌టి వ‌ర‌కు స్వ‌యం సేవ‌క్ గురించి పెద్ద‌గా తెలియ‌ద‌ని, గాంధీజీని స్వ‌యం సేవ‌క్ చంపింద‌న్న భావ‌న‌లో వున్నాన‌న్నారు. స్వ‌యం సేవ‌క్ సంఘ్ లేక‌పోతే క‌శ్మీర్ ఉండేది కాద‌ని, ఎప్పుడో పాకిస్థాన్ వ‌శ‌మ‌య్యేద‌న్నారు. స్వ‌యం సేవ‌క్ గురించి తెలుసుకుని ప‌రిపూర్ణ‌మైన ప‌శ్చాత్తాపం చెందాన‌న్నారు.

స్వ‌యం సేవ‌క్ పై క‌థ రాసి మోహ‌న్ భ‌గ‌వ‌త్ కు చూపిస్తే ఆయ‌న ఎంతో పొంగిపోయార‌ని తెలిపారు. స్వ‌యం సేవ‌క్ పై రాసిన క‌థ‌ను త్వ‌ర‌లోనే సినిమాగా, వెబ్ సిరీస్ గా చేయ‌బోతున్నాన‌ని ప్ర‌క‌టించారు.