Begin typing your search above and press return to search.

మోదీ దీపాలు వెలిగించమంటే..బీజేపీ మహిళా మోర్చా చీఫ్ ఏం చేసిందంటే?

By:  Tupaki Desk   |   6 April 2020 11:30 AM GMT
మోదీ దీపాలు వెలిగించమంటే..బీజేపీ మహిళా మోర్చా చీఫ్ ఏం చేసిందంటే?
X
కరోనా వైరస్ ను అరికట్టేందుకు ప్త్రాస్తుతం దేశంలో లాక్ డౌన్ అమల్లో ఉంది. ఈ నేపథ్యంలోనే ..దేశ ఐక్యతని చాటిచెప్పాలని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ విద్యుత్ దీపాలని ఆర్పీ ..దీపాలు - కాండిల్స్ వెలిగించాలంటు పిలుపునిచ్చారు. ఇంట్లో లైట్లను ఆర్పివేసి, గుమ్మం ముందు దీపాలను వెలిగించాలంటూ సాక్షాత్తూ దేశ ప్రధాని చేసిన సూచనను కొంతమంది గాలికి వదిలేశారు. దీపాలను వెలిగించడానికి బదులుగా.. తుపాకి తో గాల్లో కాల్పులు జరిపారు. గాల్లోకి కాల్పులు జరపడం ద్వారా కరోనా వైరస్ బెదిరిపోతుందంటూ మహిళా మోర్చా నాయకురాలు మద్దతుదారులు చెప్పుకొచ్చారు.

దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో ఇప్పుడు వైరల్‌ గా మారింది. ఆ మహిళా నాయకురాలిపై స్థానిక పోలీస్ స్టేషన్‌లో కేసు నమోదైంది. ఈ ఘటన ఉత్తర ప్రదేశ్‌ లోని బలరాంపూర్‌ లో చోటు చేసుకుంది. ఆ మహిళా నాయకురాలి పేరు మంజు తివారీ. బలరాంపూర్ నియోజకవర్గం బీజేపీ మహిళా మోర్చా అధ్యక్షురాలు. దేశవ్యాప్తంగా కమ్ముకుంటోన్న కరోనా వైరస్‌ను ఎదుర్కొనడంలో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపు మేరకు ప్రజలంతా ఆదివారం రాత్రి 9 గంటలకు 9 నిమిషాల పాటు లైట్లను ఆర్పివేసి - దీపాలను వెలిగిస్తోన్న సమయంలో మంజు తివారీ దీనికి భిన్నంగా వ్యవహరించారు.

తన లైసెన్స్ ఉన్న రివాల్వర్‌ ఉండటం తో గాలిలో కాల్పులు జరిపారు. ఈ దృశ్యాన్ని ఆమె భర్తే సెల్ ఫోన్ ద్వారా చిత్రీకరించినట్లు చెబుతున్నారు. ఈ వీడియోను సోషల్ మీడియా లో పోస్ట చేశారు. దీపాలను వెలిగించిన తరువాత కరోనా వైరస్‌ ను పారద్రోలడానికి.. అంటూ ఓ కామెంట్‌ కూడా పెట్టారు. వీడియో వైరల్‌ గా మారిన వెంటనే కొందరు స్థానికుల ఫిర్యాదు మేరకు పోలీసులు ఆమెపై కేసు నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఆమె రివాల్వర్‌ ను స్వాధీనం చేసుకున్నారని చెబుతున్నారు. ఈ ఘటనపై విచారణ ముగిసిన తరువాత రివాల్వర్‌ ను అందజేస్తామని బలరాంపూర్ పోలీసులు వెల్లడించారు. దీనిపై కొంతమంది నెటిజన్స్ ఫైర్ అవుతున్నారు.