Begin typing your search above and press return to search.

ఆగండాగండి.. మీకు న్యాయం చేస్తాం..!!

By:  Tupaki Desk   |   25 Jan 2023 9:55 AM GMT
ఆగండాగండి..  మీకు న్యాయం చేస్తాం..!!
X
చేతులు కాలిన త‌ర్వాత ఆకులు ప‌ట్టుకున్న చందంగా ఉంది కేంద్రంలోని బీజేపీ పెద్ద‌ల ప‌రిస్థితి. ఏపీలో రాజ‌కీ య ప‌రిస్థితికి అనుగుణంగా పార్టీ ప‌నిచేయ‌డం లేద‌ని.. సోము వీర్రాజు వ్య‌వ‌హారం స‌రిగాలేద‌ని.. గ‌త కొన్నాళ్లుగా మొత్తుకుంటున్న ఏపీ బీజేపీ మాజీ చీఫ్ , మాజీ మంత్రి క‌న్నా ల‌క్ష్మీనారాయ‌ణ మొత్తుకుంటు న్నారు. అయితే, ఆయ‌న వ్య‌వ‌హారాన్ని పార్టీ లైట్ తీసుకుంది. నిజానికి క‌న్నా అనేక సార్లు చెప్పారు. అయిన‌ప్ప‌టికీ.. ఆయ‌న చెప్పిన మాట‌ల‌ను పార్టీ ప‌ట్టించుకోలేదు.

ఇక‌, ఇప్పుడు క‌న్నా.. పార్టీ మారేందుకు రెడీ అయ్యారు. ఆయ‌న జ‌న‌సేన‌లోకి చేరుతున్న‌ట్టుగా కూడా వార్త‌లు వ‌స్తున్నాయి. వ‌చ్చే ఎన్నిక‌ల్లో టీడీపీ-జ‌న‌సేన క‌లిసి పోటీ చేసినా..చేయ‌కున్నా.. జ‌న‌సేన‌లోకి క‌న్నావెళ్లిపోవాల‌ని నిర్ణ‌యించుకున్న‌ట్టు ఆయ‌న అనుచ‌ర వ‌ర్గాలు కూడా చెబుతున్నాయి. ఈ నేప‌థ్యంలో స‌త్తెన‌ప‌ల్లి నుంచి క‌న్నా పోటీ చేయ‌నున్నార‌ని కూడా అంటున్నారు. వాస్త‌వానికి క‌న్నాకు క‌లిసి వ‌చ్చిన నియోజ‌క‌వ‌ర్గం పెద‌కూర‌పాడు.

గ‌తంలో కాంగ్రెస్ త‌ర‌ఫున ఆయ‌న పెదకూర‌పాడు నియోజ‌క‌వ‌ర్గం నుంచి పోటీ చేసి వ‌రుస విజ‌యాలు ద‌క్కించుకున్నారు. అయితే.. జ‌న‌సేన అవ‌స‌రం, క‌న్నా అవ‌కాశం రెండూక‌లిసి వ‌చ్చి స‌త్తెన‌ప‌ల్లి ఖ‌రారైం ద‌ని తెలుస్తోంది. ఇదిలావుంటే, ఇక‌, ఈ వార్త వెలుగు చూసిన త‌ర్వాత‌.. బీజేపీ అధిష్టానం క‌దిలి వ‌చ్చిన‌ట్టు తెలుస్తోంది. ఆగండాగండి.. మీకున్యాయం చేస్తాం.. అంటూఢిల్లీ పెద్ద‌లు ఫోన్ చేశార‌ని.. క‌న్నా అనుచ‌రులు చెబుతున్నారు.

ఏపీ బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సమావేశాలకు కన్నా లక్ష్మీనారాయణ దూరంగా ఉన్నారు. దీంతో కార్యవర్గ సమావేశానికి కన్నా రాకపోవడంతో పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. ఇటీవల జాతీయ కార్యవర్గ సమావేశాలకు కూడా ఆయన హాజరుకాలేదు. దీనిపై జాతీయ నేతలు ఆరా తీశారు. దీనికి తోడు ఇప్పుడు పార్టీ మారిపోతున్నార‌నే వార్త‌లు వ‌స్తున్న నేప‌థ్యంలో క‌న్నా విష‌యంపై పార్టీ కొంత అలెర్ట్ అయిన‌ట్టు స‌మాచారం. అయితే.. దీనిపై క్లారిటీ రావాల్సి ఉంద‌ని పార్టీ వ‌ర్గాలు చెబుతున్నాయి.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.