ఆ బిజినెస్ కోసం భార్యను కూడా వాడేసిన రాజ్ కుంద్రా?

Sat Jul 31 2021 11:15:19 GMT+0530 (IST)

Bjp Leader Shocking Facts About Raj Kundra

బూతు సినిమాలు తీస్తున్నారన్న ఆరోపణలతో అదుపులోకి తీసుకున్న బాలీవుడ్ నటీమణి శిల్పాశెట్టి భర్త రాజ్ కుంద్రా ఉదంతం సంచలనంగా మారిన సంగతి తెలిసిందే. అతడిపై నేరారోపణలు వెలుగు చూసిన తర్వాత నుంచి పలు కథనాలు బయటకు వచ్చాయి. ఒక దశలో ఈ వ్యవహారంలో నటి శిల్పాశెట్టికి సంబంధం ఉందా? అన్నది అనుమానంగా మారింది. విచారణలో భాగంగా నటి శిల్పాశెట్టిని ముంబయి క్రైం బ్రాంచ్ పోలీసులు గంటల పాటు ప్రశ్నించటం తెలిసిందే. తనకు ఏ సంబంధం లేదని చెప్పటమే కాదు.. రాజ్ కుంద్రా చేసిన పనిని మొదట్లో నమ్మకున్నా.. తర్వాత వస్తున్న సమాచారంతో పోలీసుల్ని సైతం ఆమె అడిగినట్లుగా చెబుతారు.ఇదిలా ఉంటే.. తాజాగా రాజ్ కుంద్రా ఉదంతంపై బీజేపీ నేత రామ్ కదం సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటికే ఆయనపై వచ్చిన పలు ఆరోపణలకు ఒక మోడల్ ను శారీరకంగా వేధించారన్న విషయం షాకింగ్ గా మారింది. ఇదిలా ఉంటే.. బీజేపీ నేత వెల్లడించిన సమాచారం ప్రకారం.. ఆన్ లైన్ గేమ్ పేరుతో రూ.3వేల కోట్లను ప్రజల నుంచి వసూలు చేసినట్లుగా ఆరోపించారు. ఆన్ లైన్ గేమ్ పేరుతో లక్షలాది మందిని మోసగించినట్లు ఆయన చెబుతున్నారు. ఈ బిజినెస్ ప్రచారం కోసం భార్య కమ్ నటి శిల్పను కూడా వాడేసినట్లుగా ఆయన వ్యాఖ్యానించారు.

ఒక మోడల్ తనపై రాజ్ కుంద్రా శారీరక వేధింపులకు గురి చేసినట్లుగా పిర్యాదు చేస్తే.. అతడిపై అప్పట్లో పోలీసులు కేసు పెట్టేందుకు కూడా ఇష్టపడలేదన్న ఆరోపణ ఇప్పుడు సంచలనంగా మారింది. పోలీసులు తమ పని తాము చేసుకోకుండా రాజకీయ ఒత్తిడి తెచ్చినట్లుగా చెప్పారు. దీంతో.. రాజ్ కుంద్రా వ్యవహారం ఇప్పుడు పొలిటికల్ కలర్ లోకి మారినట్లైంది. రాజ్ కుంద్రా తన వియాన్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ ద్వారా ‘గేమ్ ఆఫ్ డాట్’ అనే ఆన్ లైన్ గేమ్ ను ప్రారంభించారన్నారు. దీనికి శిల్పాను మోడల్ గా ఆమె చేత ప్రచారం చేశారన్నారు.

అతేకాదు.. ఈ గేమ్ కు ప్రభుత్వం నుంచి కూడా గుర్తింపు ఉన్నట్లు ప్రచారం చేసినట్లుగా కూడా చెబుతున్నారు.దీంతో చాలామంది డిస్ట్రిబ్యూటర్లుగా చేరారని.. భారీగా నష్టపోయినట్లుగా విమర్శించారు. అతడి మాటల ప్రచారానికి నమ్మి ఒక్కొక్క డిస్ట్రిబ్యూటర్ రూ.10 నుంచి రూ.30 లక్షల వరకు నష్టపోయినట్లుగా చెబుతున్నారు. తమకు జరిగిన అన్యాయంపై పోలీసులకు కంప్లైంట్లు ఇచ్చేందుకు వెళితే.. ఫిర్యాదు తీసుకోవటం తర్వాత.. రివర్సులో వారిపైనే కేసులు పెట్టినట్లుగా వినిపించే ఆరోపణల్ని బీజేపీ నేత రివీల్ చేశారు. తాజా పరిణామం ఇప్పుడు కొత్త సంచలనంగా మారింది. ఇప్పటివరకు శిల్పాశెట్టి కుటుంబం వరకే ఉన్న ఆరోపణలు ఇప్పుడు అధికారపక్ష నేతలకు కొత్త తలనొప్పులు తెచ్చేలా ఉన్నాయన్న మాట వినిపిస్తోంది.