బీజేపీ నేత ఆత్మహత్య.. కలకలం

Wed Jan 13 2021 23:00:01 GMT+0530 (IST)

BJP leader commits suicide

బీజేపీ నేత రియల్ ఎస్టేట్ వ్యాపారి సంరెడ్డి వెంకటరెడ్డి ఆత్మహత్య చేసుకోవడం కలకలం రేపింది. భూవివాదం ఆర్థిక లావాదేవీల నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు సమాచారం. తుర్కయాంజల్ మున్సిపాలిటీలోని తొర్రూర్ గ్రామానికి చెందిన వెంకటరెడ్డి తన వ్యవసాయ భూమి పక్కనే గల ఎకరంన్నర భూమికి సంబంధించి పక్క రైతు వద్ద అగ్రిమెంట్ చేసుకున్నారు.అందుకోసం ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి వద్ద సుమారు రూ.కోటి తీసుకున్నట్టు సమాచారం. వాటికి రూ.30 లక్షలు కలిపి రైతుకు ఇచ్చినట్టు సమాచారం.అయితే ఏళ్లు గడుస్తున్న సదురు రైతు భూమిని రిజిస్ట్రేషన్ చేయడం లేదట.. తీసుకున్న డబ్బులు కూడా తిరిగి ఇవ్వడం లేదు. దీనిపై కొద్దికాలంగా భూవివాదం నడుస్తోంది.

దీంతో తీవ్రమనస్థాపానికి గురైన వెంకటరెడ్డి తన పొలం వద్ద ఒంటిపై పెట్రోల్ పోసుకొని నిప్పు అంటించుకున్నాడు. తీవ్రగాయాలపాలైన వెంకటరెడ్డి ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సాయంత్రం 5 గంటలకు మృతిచెందాడు.

సంరెడ్డి వెంకటరెడ్డి నగరంలోని ప్రముఖ రియల్ ఎస్టేట్ కంపెనీలకు భూములు ఇప్పించేవారు. ప్రముఖ రియల్ ఎస్టేట్ సంస్థలకు వేల ఎకరాల భూములు ఇప్పించినట్టు గ్రామస్థులు తెలిపారు.

ఇక ప్రతి ఎన్నికల్లో వెంకటరెడ్డి పోటీచేస్తారు. తుర్కయాంజాల్ మున్సిపాలిటీలో పోటీచేసి ఇటీవల ఓడిపోయారు. తాజాగా ఆయన మృతి విషాదం నింపింది.