పవన్ కు గౌరవమిచ్చిన బీజేపీ.. మళ్లీ పొత్తు

Sun Apr 18 2021 16:57:50 GMT+0530 (IST)

BJP honors Pawan

తెలంగాణలో.. అటు ఏపీలో పోటీచేయకుండా బీజేపీకి మద్దతిస్తూ జనసేన తన పార్టీ ఎన్నికల గుర్తు ‘గాజు గ్లాసు’ను ఇటీవల పోగొట్టుకుంది. ఇక అలాంటి సాహసానికి ఒడిగట్టకుండా ఈసారి ఎన్నికల బరిలోకి దిగింది.ట్విస్ట్ ఏంటంటే.. తెలంగాణ బీజేపీ నేతలు తమకు గౌరవం ఇవ్వడం లేదని.. అవమానించేలా మాట్లాడారని ఇటీవల తెలంగాణ బీజేపీతో దోస్తీ కటీఫ్ చేశారు పవన్ కళ్యాణ్. ఇటీవల గ్రాడ్యూయేట్ ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీఆర్ఎస్ కు పవన్ కళ్యాణ్ మద్దతు పలికారు. దీంతో బీజేపీ జనసేన బంధానికి బీటలు వారాయి.

అయితే తాజాగా ఏమైందో కానీ మళ్లీ తెలంగాణ బీజేపీ.. జనసేనాని పవన్ కు గౌరవం ఇచ్చినట్టుంది. అందుకే తెలంగాణలో బీజేపీ-జనసేన మధ్య పొత్తు కుదిరింది. ఖమ్మం మున్సిపల్ ఎన్నికల్లో రెండు పార్టీలు కలిసి పోటీచేయాలని నిర్ణయించాయి. ఈ మేరకు జనసేన పార్టీ ఓ ప్రకటన విడుదల చేశాయి.

జనసేన అధినేత పవన్ కళ్యాణ్ ఆదేశాలతో ఇరుపార్టీల నేతలు చర్చలు జరిపారు. బీజేపీ-జనసేన నేతల మధ్య ఒప్పందం కుదిరింది.. జనసేన పార్టీ తరుఫున ఆ పార్టీ తెలంగాణ ఇన్ చార్జ్ శంకర్ గౌడ్ రామ్ తూళ్లూరి వివి రామారావు పాల్గొన్నారు. బీజేపీ తరుఫున చింతల రాంచంద్రారెడ్డి శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు.

పొత్తు పొడవడంతో జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. దీంతో బీజేపీ ఈసారి పవన్ కు గౌరవం ఇచ్చిందని.. కాసిన్ని సీట్లు ఇచ్చి పోటీ చేయమందని రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతోంది.