తెలంగాణ బీజేపీ ఎంపీ అభ్యర్థులు వీరే!

Thu Mar 21 2019 22:08:11 GMT+0530 (IST)

తెలంగాణలో పోటీ చేసే బీజేపీ ఎంపీ అభ్యర్థులపై స్పష్టత వచ్చింది. నామినేషన్ల పర్వం మొదలై.. మరో మూడు రోజుల్లో ముగియనున్న వేళ..ఇప్పటివరకూ తన అభ్యర్థులను బీజేపీ ప్రకటించలేదు. గురువారం రాత్రి తన అభ్యర్థుల్ని ప్రకటించింది. జాతీయ స్థాయిలో మొత్తం 182 మంది అభ్యర్థుల్ని ప్రకటించగా.. అందులో పది మంది తెలంగాణ రాష్ట్రం బరిలో దిగనున్న అభ్యర్థులు ఉన్నారు.ముందు నుంచి అనుకున్నట్లే సికింద్రాబాద్ స్థానం నుంచి కిషన్ రెడ్డికి టికెట్ కేటాయించగా.. ఇటీవల పార్టీలో చేరిన డీకే అరుణకు మహబూబ్ నగర్ ఎంపీ స్థానాన్ని కేటాయించారు. తెలంగాణ బీజేపీ తరఫు పోటీ చేస్తున్న అభ్యర్థుల వివరాలు చూస్తే..

1. కరీంనగర్                 బండి సంజయ్

2. నిజామాబాద్             డి. అరవింద్

3. మల్కాజిగిరి             ఎన్. రామచంద్రరావు

4. సికింద్రాబాద్           జి. కిషన్ రెడ్డి

5. మహబూబ్ నగర్     డీకే అరుణ

6. నాగర్ కర్నూల్         బంగారు శృతి

7. నల్గొండ                    జి. జితేందర్ కుమార్

8.  భువనగిరి                 వి. శ్యాంసుందరరావు

9. వరంగల్                    చింతా సాంబమూర్తి

10. మహబూబాబాద్       హుస్సేన్ నాయక్