Begin typing your search above and press return to search.

జమిలి ఎన్నికలు 2022లోనే?

By:  Tupaki Desk   |   14 July 2020 2:00 PM GMT
జమిలి ఎన్నికలు 2022లోనే?
X
అప్పుడే మళ్లీ ఎన్నికలు వస్తున్నాయా? అని పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. మోడీ ఎన్నికల్లో గెలవడానికి ఏదో ఒక ప్లాన్ చేస్తాడు అని.. అందులో భాగమే ఈ జమిలీ ఎన్నికలు అని అంటున్నారు. ఎందుకంటే చైనాపై యుద్ధం, కరోనా కంట్రోల్, కాంగ్రెస్ మీద సానుభూతి ఉన్నా వాళ్ల మధ్య సఖ్యత లేని ఈ టైంలో ఎన్నికలకు వెళ్లడమే మంచిదని మోడీషాలు భావిస్తున్నారట..

రాష్ట్రాలకు అభివృద్ధి నిధులు ఇవ్వకుండా జమిలి ఎన్నికల తర్వాత అన్ని రాష్ట్రాల్లో బీజేపీ అధికారంలోకి తెచ్చుకొని.. దేశం మొత్తం బీజేపీనే ఉండేలా చేయడం లాంటి ప్లాన్లు ఎన్నో చేయబోతున్నారని ఢిల్లీ బీజేపీ వర్గాలు చెప్పుకుంటున్నాయి.

అయితే మోడీ మీద ముందున్న సానుభూతి అంతా ఇప్పుడు ప్రజల్లో లేదని తెలుస్తోంది.. కరోనా టైంలో అధికారంలో ఉన్నా ప్రజలకు ఏమీ చేయకుండా 21 లక్షల కోట్లు అంటూ అబద్ధాలు చెప్పారని.. ఎవరికి ఎటువంటి ఆర్థిక భరోసా కల్పించలేదని.. సాయం చేయలేదని అపవాదు ఉంది. ఇప్పటికే దేశ జీడీపీ పూర్తిస్థాయిలో పడిపోయింది. చైనా దేశం భారత్ పై దండెత్తి లోపలికి వచ్చినా బయటకు చెప్పలేదని మోడీపై విమర్శలున్నాయి.

ఇక రాష్ట్రాలతో సఖ్యత లేకుండా కేంద్రంలోని బీజేపీ వాళ్ల పెత్తనం ఎక్కువ అయ్యింది. ఇలాంటివి అన్నింటిపై ప్రతిపక్షాలు ప్రజల్లోకి వెళ్లి బాగానే ప్రచారం చేశాయని కొన్ని వర్గాలంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి అధికారంలో ఉంటే బీజేపీ మీద నమ్మకం సన్నగిల్లుతుందని.. అందుకే బీజేపీ జమిలీ ఎన్నికలకు ముందుగానే వెళ్తోందని ప్రచారం సాగుతోంది.