Begin typing your search above and press return to search.

వ‌రుణ్ గాంధీ.. సంచ‌ల‌న వీడియో.. రైతుల విష‌యంలో మోడీకి మ‌రింత సెగ‌

By:  Tupaki Desk   |   15 Oct 2021 12:30 AM GMT
వ‌రుణ్ గాంధీ.. సంచ‌ల‌న వీడియో.. రైతుల విష‌యంలో మోడీకి మ‌రింత సెగ‌
X
రైతుల‌కు సంబంధించి జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై.. బీజేపీ ఎంపీ వ‌రుణ్ గాంధీ తాజాగా సోష‌ల్ మీడి యాలో పోస్ట్ చేసిన వీడియో.. మోడీ స‌ర్కారుకు సెగ పెడుతోంది. సొంత పార్టీ ఎంపీనే అయిన‌ప్ప‌టికీ.. వ‌రుణ్‌.. కొన్ని రోజులుగా రైతుల‌కు అనుకూలంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇటీవ‌ల కాలంలో నూత‌న సాగు చ‌ట్టాల విష‌యంలో ఇప్ప‌టికే కేంద్రంలోని మోడీ ప్ర‌భుత్వానికి అన్ని వైపుల నుంచి సెగ తగులుతోంది. నూత‌న సాగు చ‌ట్టాల‌ను బ‌ల‌వంతంగా రుద్దు తున్నార‌ని.. రైతుల హ‌క్కుల‌పై ఉక్కు పాదం మోపుతున్నా ర‌నే విమ‌ర్శ‌లు వ‌స్తున్నాయి. అంతేకాదు..రైతులు కూడా పంజాబ్‌, ఢిల్లీ స‌రిహద్దుల్లో నెల‌ల త‌ర‌బ‌డి ధ‌ర్నాలు, ఆందోళ‌న చేస్తున్నారు.

మోడీ వైఖ‌రిపై చ‌ర్చ‌!

ఇదిలావుంటే.. ఇటీవ‌ల ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లోని ల‌ఖీంపూర్ ఖేరీలో జ‌రిగిన ఘ‌ట‌న‌.. రైతులు మృతి చెంద‌డం.. కేంద్ర మంత్రి కుమారుడి ప్ర‌మేయం ఉండ‌డం ప‌రిణామాల నేప‌థ్యంలో రైతుల ప‌ట్ల మోడీ వైఖ‌రి మ‌రింత చ‌ర్చ‌నీయాంశంగా మారింది. ఈ క్ర‌మంలో తాజాగా బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ మాజీ ప్రధాన మంత్రి, బీజేపీ అగ్రనేత దివంగత అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రసంగానికి సంబంధించిన ఒక సంచలన వీడియోను పోస్ట్‌ చేశారు. రైతుల అణచివేతకు వ్యతిరేకంగా ఉన్న ఆయన ప్రసంగం క్లిప్ ఇది. దీనిని ట్విటర్‌లో పోస్ట్ చేశారు. ఒకప్పటి ఇందిరాగాంధీ ప్రభుత్వాన్ని విమర్శిస్తూ రైతులకు మద్దతుగా నిలిచిన వాజ‌పేయి ప్రసంగ వీడియో ఇపుడు వైరల్‌గా మారింది.

తొలి నుంచి స్పందించింది వ‌రుణే!

మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయచట్టాలకు వ్యతిరేకంగా రైతుల సుదీర్ఘ ఉద్యమం, లఖీంపూర్‌ ఖేరిలో రైతులపై హింసాకాండ నేపథ్యంలో బీజేపీ నేత ట్విట్‌ చేసిన ఈ వీడియో సంచలనం గా మారింది. "పెద్ద మనసున్న నాయకుడి నోట తెలివైన మాటలు" అంటూ వరుణ్‌ గాంధీ ట్వీట్ చేశారు. బీజేపీ ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు అగ్రి చట్టాలకు వ్యతిరేకంగా రైతులు ఆందోళన సందర్భంలో వాజ్‌పేయి ప్రసంగాన్ని షేర్‌ చేయడమంటే మోదీ సర్కార్‌కు షాకేనని భావిస్తున్నారు. వరుణ్‌ గాంధీ షేర్‌ చేసిన వీడియోలో చట్టలను దుర్వినియోగం చేస్తూ ప్రభుత్వం రైతులను అణచివేయ డంపై వాజ్‌పేయి అప్పటి ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.

వాజ్‌పేయి ఏమ‌న్నారంటే..

"రైతులను భయపెట్టొద్దు. వారు భయపడాల్సిన అవసరం లేదు. మేము రైతుల ఉద్యమాన్ని రాజకీయాల కోసం ఉపయోగించుకోవాలనుకోవడం లేదు. కానీ అన్నదాతల శాంతియుత ఆందోళనను అణచివేయాల ని చూస్తే మాత్రం వారికి అండగా నిలబడటానికి ఏమాత్రం వెనుకాడము" అని వాజ్‌పేయి కేంద్రాన్ని హెచ్చరించడం ఈ క్లిప్పింగ్‌లో చూడొచ్చు.

వ‌రుణ్ తో బీజేపీ ఇక‌, తాడో పేడో..

ఉత్తరప్రదేశ్‌లోని లఖింపూర్ ఖేరి హింసపై ఘాటుగా స్పందించిన ఏకైక బీజేపీ ఎంపీవరుణ్ గాంధీ. హత్యలతో వారి నోళ్లు మూయించలేరంటూ ఈ సంఘటన వీడియోను ట్వీట్ చేశారు. అమాయక రైతుల రక్తం చిందిన వైనానికి జావాబుచెప్పాలని, నలుగురు రైతుల మరణానికి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని వరుణ్‌ గాంధీ డిమాండ్‌ చేశారు. కారుతో ఢీకొట్టి మరీ రైతులను హత్య చేశారన్న ఆరోపణల్లో హోం శాఖ స‌హాయ‌ మంత్రి అజయ్ మిశ్రా కుమారుడు ఆశిష్ మిశ్రా నిందితుడుగా ఉన్నారు. మరోవైపు కొత్త చట్టాలను వ్యతిరేకిస్తున్న రైతులకు మద్దతుగా మాట్లాడిన నెల రోజులకు బీజేపీ జాతీయ కార్యనిర్వాహక సభ్యుడుగా వరుణ్‌ను తొలగించిన సంగతి తెలిసిందే. అయితే.. ఈ దూకుడు మ‌రింత పెంచ‌డం.. చూస్తే.. వ‌రుణ్ గాంధీ బీజేపీతో తాడో పేడో తేల్చుకోవ‌డం ఖాయ‌మ‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు.