Begin typing your search above and press return to search.

మోడీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎంపీ .. జీఎస్టీ మోడీ పిచ్చి చర్య !

By:  Tupaki Desk   |   20 Feb 2020 8:30 AM GMT
మోడీకి షాక్ ఇచ్చిన బీజేపీ ఎంపీ .. జీఎస్టీ మోడీ పిచ్చి చర్య !
X
కేంద్రంలో బీజేపీ అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఎవ్వరూ ఉహించనటువంటి పలు సంచలన నిర్ణయాలని తీసుకుంటూ పాలన కొనసాగిస్తుంది. ముఖ్యంగా ప్రధాని మోడీ , మాజీ అధ్యక్షుడు ..ప్రస్తుత కేంద్రమంత్రి అమిత్ షా ద్వయం ..తమ వ్యూహాలతో ప్రత్యర్దులని ముప్పుతిప్పలుపెట్టి మూడుచెరువుల నీళ్లు తాగించారు. ప్రస్తుతం నేషనల్ లెవెల్ లో బీజేపీ కొట్టే పార్టీ మరొకటి లేదు అని చెప్పడంలో ఎటువంటి అతిశయోక్తిలేదు. ఇక బీజేపీ ప్రభుత్వం వచ్చిన తరువాత తీసుకున్న అత్యంత కీలకమైన నిర్ణయాలతో జీఎస్టీ కూడా ఒకటి.

ప్రస్తుతం ఈ జీఎస్టీ వల్ల కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ.. భవిష్యత్తు లో జీఎస్టీతో మంచి ఫలితాలుంటాయని, దీర్ఘకాలిక ప్రయోజనాలను దృష్టిలో పెట్టుకునే ఈ నిర్షయం తీసుకున్నట్లు కేంద్రం తెలిపింది. అయితే , ఈ జీఎస్టీపై తాజా బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి సంచలన వ్యాఖ్యలు చేసారు. గతంలో ఈయన అనేకసార్లు కేంద్రం తీసుకున్న కొన్ని నిర్ణయాలపై అసంతృప్తిని వ్యక్తం చేసారు. తాజాగా జీఎస్టీ పై ఈయన చేసిన వ్యాఖ్యలు ..ఇప్పుడు బీజేపీలో , దేశ రాజకీయాలలో హాట్ టాపిక్ గా మారాయి.

అసలు బీజేపీ ఎంపీ సుబ్రమణ్యస్వామి ..జీఎస్టీ పై ఎటువంటి కామెంట్స్ చేసారు? అలా అయన మాట్లాడటానికి గల కారణమేంటి ? అనే విషయాలని చూస్తే .. తాజాగా సుబ్రమణ్యస్వామి హైదరాబాద్ లో ప్రజ్ఞాభారతి ఆధ్వర్యం లో ఓ హోటల్‌లో నిర్వహించిన కార్యక్రమంలో '2030 నాటికి బలమైన ఆర్థిక శక్తిగా భారత్' అనే అంశంపై మాట్లాడుతూ.. 2020-21 నాటికి భారత్ 5 ట్రిలియన్ డాలర్ల వృద్ధి సాధిస్తుందని, చైనా ఆర్థిక వ్యవస్థను భారత్ త్వరలోనే అధిగమిస్తుందని ఆశాభావం వ్యక్తం చేసారు. అలాగే స్వాతంత్ర్యం వచ్చిన నాటి నుంచి 1990 వరకు దేశం అంతగా అభివృద్ధి చెందలేదని, ప్రస్తుతం ఏడాదికి 3.5 శాతం మాత్రమే జీడీపీ వృద్ధి సాధిస్తోందని , దీనికి కారణం మాజీ ప్రధాని జవహర్ లాల్ నెహ్రూనే అంటూ సంచలన ఆరోపణలు చేసారు. నెహ్రూ అవలంభించిన సోవియెట్ ఆర్థిక విధానాల వల్లే ఇలాంటి పరిస్థితులు ఏర్పాడ్డయని అన్నారు.

అయితే , ఆ తరువాత ప్రధాని పీవీ నర్సింహారావు తీసుకొచ్చిన ఆర్థిక సంస్కరణలతో ఆ సమయంలో ఏడాదికి 8 శాతం జీడీపీ వృద్ధి సాధించిందని , దేశంలో సంస్కరణలను ప్రవేశపెట్టిన పీవీ నర్సింహారావుకు భారతరత్న ఇవ్వాలని సుబ్రమణ్యస్వామి డిమాండ్ చేశారు. అనంతరం వచ్చిన మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ కూడా దాన్ని కొనసాగించారని చెప్పారు. అప్పటి నుంచి దేశ జీడీపీ వృద్ధిరేటు పెరుగుతూ వచ్చిందన్నారు. నేటి ప్రధాని నరేంద్ర మోడీ కూడా ఆర్థిక సంస్కరణలు తీసుకొస్తున్నారని ప్రశంసించారు. ఇవి భవిష్యత్తు లో మంచి ఫలితాలనిస్తాయని అన్నారు.10 శాతం వృద్ధి సాధిస్తే.. వచ్చే పదేళ్లలో భారత్ చైనాను చాలా సులభంగా దాటేస్తుంది అని చెప్పారు. ఈ క్రమంలోనే .. ఆర్థిక సంస్కరణలో భాగంగా కేంద్రం తీసుకొచ్చిన జీఎస్టీ ..ఈ 21వ శతాబ్దం లో తీసుకున్న అతిపెద్ద పిచ్చి చర్యగా ఆయన అభివర్ణించారు. ఈ ఆదాయపు పన్ను, జీఎస్టీ తో పెట్టుబడిదారులు , దేశంలో పెట్టుబడి పెట్టాలంటే భయంతో వణికి పోతున్నారని , ఇది మంచిది కాదు అని అన్నారు.