మహిళలు నైట్ డ్యూటీలు చేయటానికి అనుమతించవద్దు : బీజేపీ ఎమ్మెల్సీ

Fri Sep 24 2021 08:00:01 GMT+0530 (IST)

BJP MLC who made sensational remarks

మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. ప్రభుత్వాలు ఎంత కఠిన చట్టాలు తీసుకొస్తున్నా కూడా మహిళలపై జరిగే అఘాయిత్యాలని మాత్రం అడ్డుకట్ట వేయలేకపోతున్నారు. నిత్యం మానసిక శరీరక హింసకు గురవుతున్నారు. మహిళలు భద్రత. ఈ విషయం ఎంత సున్నితమో..అంత వివాదం కూడా. ఈక్రమంలో కొన్ని వ్యాఖ్యలు వివాదంగా మారుతుంటాయి. ముఖ్యంగా రాజకీయనేతలు మాట్లాడే సమయంలో ఏ ఉద్ధేశ్యంతో మాట్లాడినా అది ఎటువైపు దారి తీస్తుందో చెప్పలేం. ఈక్రమంలో బీజేపీ మహిళా నేత మహిళా ఉద్యోగినుల భద్రత గురించి మాట్లాడిన మాటలు వివాదంగా మారాయి.ఈ నేపథ్యంలో ఓ మహిళ ఎమ్మెల్యే చేసిన వ్యాఖ్యలు దేశవ్యాప్తంగా పెద్ద దుమారమే రేపుతున్నాయి. కర్ణాటక బీజేపీ ఎమ్మెల్సీ భారతి శెట్టి తాజాగా వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. మహిళా ఉద్యోగినుల భద్రత కోసం రాత్రి వేళల్లో ఓవర్ టైం పనిచేయడానికి అనుమతించరాదని భారతిశెట్టి సూచించారు. రాత్రివేళల్లో పనిచేస్తున్న మహిళలు లక్ష్యంగా నేరాలు జరుగుతున్నాయని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.

ఓవర్ టైం పనిచేసేందుకు వారిని అనుమతించరాదని భారతి కోరారు. మరోవైపు నేరస్థుల పట్ల కఠినంగా వ్యవహరించడానికి న్యాయవ్యవస్థకు కోరలు లేవని అందువల్ల నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని ఆమె ఆందోళన వ్యక్తం చేశారు. నేరాలను నిర్మూలించడానికి కఠినతరమైన కొత్త చట్టాలు అవసరమని ఎమ్మెల్సీ భారతిశెట్టి అభిప్రాయపడ్డారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలు మరింత కఠిన చట్టాలు తీసుకురావల్సిన అవసరముందన్నారు. కాగా భారతిశెట్టి చేసిన వ్యాఖ్యలు మహాత్మాగాంధీ కల రామరాజ్య స్ఫూర్తితో లేవని మహిళల భద్రత అన్ని సమయాల్లో ఉండేలా చూడాలని ప్రతపక్ష నేత ఎస్ఆర్ పాటిల్ సూచించారు. భారతి చేసిన సూచన ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ విప్ ఎం నారాయణస్వామి పేర్కొన్నారు.

బుధవారం మైసూర్ లో జరిగిన గ్యాంగ్ రేప్ ఘటన గురించి జరిగిన చర్చలో భారతి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మహిళలు భద్రత కోసం నైట్ డ్యూటీలు చేయటానికి ఆయా కంపెనీలు అనుమతించవద్దని ఆమె కోరారు. అంతేకాదు..నేరస్థుల్ని కఠినంగా శిక్షించటానికి న్యాయవ్యవస్థకు కోరలు లేవని..అందుకే నేరాలు బాగా పెరిగిపోతున్నాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా మహిళల భద్రత పట్ల ప్రభుత్వాలు మరింత కఠిన చట్టాలు తీసుకురావల్సిన అవసరముందన్నారు.భారతిశెట్టి చేసిన వ్యాఖ్యలు మహాత్మాగాంధీ కల రామరాజ్య స్ఫూర్తితో లేవని..మహిళల భద్రత అన్ని సమయాల్లో ఉండేలా చూడాలని కాంగ్రెస్ నేత ఎస్ఆర్ పాటిల్ సూచించారు. భారతి చేసిన సూచన ఆచరణ సాధ్యం కాదని కాంగ్రెస్ చీఫ్ విప్ ఎం నారాయణస్వామి అన్నారు.