కరోనా సెంటర్ కి వెళ్లిన బీజేపీ ఎమ్మెల్యే .. ఆ తర్వాత ఏమైందంటే !

Tue Aug 04 2020 17:00:58 GMT+0530 (IST)

BJP MLA who went to Corona Center What happened after that

ప్రస్తుతం దేశంలో కరోనా మహమ్మారి రోజురోజుకి మరింతగా విజృంభిస్తూ విలయతాండవం చేస్తుంది. ముఖ్యంగా రోజు వారి నమోదు అయ్యే కేసుల్లో ఇప్పుడు ప్రపంచంలోనే ఇండియా మొదటిస్థానంలో ఉండటం కొంచెం ఆందోళన కలిగించే విషయం. ఇప్పటికే  దేశంలో మొత్తం కేసుల సంఖ్య 1855745కి చేరింది. అటు దేశంలో మరణాల సంఖ్య భారీగా పెరిగింది. అలాగే మరణాల సంఖ్య కూడా 40 వేలకి చేరువలో ఉంది. సామాన్యుల నుండి ప్రముఖులు ప్రజాప్రతినిధులు కూడా కరోనా భారిన పడుతున్నారు. ఇకపోతే తాజగా ఓయ్ బీజేపీ ఎమ్మెల్యే కరోనా సెంటర్ ను తనిఖీ చేయడానికి వెళ్లి చిక్కుల్లో పడ్డారు. ఇంతకీ ఆ బీజేపీ ఎమ్మెల్యే ఎవరు అంటే .. త్రిపురలో బీజేపీ ఎమ్మెల్యే సుదీప్  రాయ్ బర్మన్. కరోనా నిబంధనలను లెక్కచేయకుండా అనధికారికంగా కరోనా కేర్  సెంటర్ ని సందర్శించారని ఆయనపై కోర్టు కేసు నమోదయింది.పూర్తి వివరాల్లోకి వెళ్తే .. అగర్తలలోని తన నియోజకవర్గంలో ఓ కరోనా బాధితుడు  తమ సెంటర్ లో అసలు  పరిస్థితులు బాగాలేవు అని  సోషల్ మీడియాలో వీడియోలను పోస్ట్ చేశాడు. ఆ వీడియో చూసిన  ఎమ్మెల్యే పీపీఈ సూట్ ధరించి తనిఖీకి వెళ్లి కరోనా పేషంట్ల ఆర్తనాదాలు తెలుసుకున్నారు.ఈ విషయం వెస్ట్ త్రిపుర జిల్లా మేజిస్ట్రేట్ దృష్టికి వెళ్లడంతో ఆయన తనకు తానుగా సుమోటో కేసు ఫైల్ చేశారు. సుదీప్ రాయ్ ని తప్పనిసరిగా 14 రోజులపాటు క్వారంటైన్ కి వెళ్లాలని ఆదేశించారు. అయితే  దానికి అయన ఒప్పుకోలేదు. నేను   డాక్టర్ల సలహా వైద్య అధికారుల సూచన తీసుకునే ఒళ్ళంతా పీపీఈ కిట్ ధరించి ఆ కోవిడ్ సెంటర్లోకి వెళ్లానని అలాగే  పేషంట్లకు ఒక మీటర్ దూరం నిలబడి వారి బాధలు విన్నానని తెలిపారు. అలాగే తనకు మేజిస్ట్రేట్ జారీ చేసిన మెమొరాండం అందక ముందే మొదట మీడియాకు ఆ తరువాత సోషల్ మీడియాలో ఎలా ప్రచారం అవుతుంది అని ప్రశ్నించారు.