Begin typing your search above and press return to search.

హాస్పిటల్ కారిడార్లో స్ట్రెచర్ల పై మృతదేహాలు..ఎక్కడంటే ?

By:  Tupaki Desk   |   26 May 2020 10:30 AM GMT
హాస్పిటల్ కారిడార్లో స్ట్రెచర్ల పై మృతదేహాలు..ఎక్కడంటే ?
X
దేశంలో రోజురోజుకి మహమ్మారి పాజిటివ్ కేసులు పెరుగుతున్న నేపథ్యంలో అందరిలో ఆందోళన పెరిగిపోతుంది. ఈ నేపథ్యంలో ముంబైలో షాకింగ్ ఉదంతం ఒకటి వెలుగులోకి వచ్చింది. ముంబైలోని కింగ్ ఎడ్వర్డ్ మెమోరియల్ హాస్పిటల్ కారిడార్ లో మృతదేహాలు స్ట్రెచర్ల పై పడి ఉన్నాయి. నిర్లక్ష్యానికి ఇది పరాకాష్టగా చెప్పవచ్చు. ఈ దిగ్భ్రాంతికరమైన ఫోటోను బీజేపీ ఎమ్మెల్యే నితేష్ రాణే తన ట్విటర్ లో పోస్ట్ చేశారు.

ఇదీ ముంబైలోని కేఈఎం ఆసుపత్రి అంటూ అయన ట్వీట్ చేశారు. అయితే ఆసుపత్రిలో ఈ కారిడార్ ప్రస్తుతం వినియోగంలో వుందా లేక ఖాళీగా ఉన్న ప్రదేశంలో ఆ మృతదేహాలను ఉంచారా అనేది తెలియాల్సి ఉంది. దీనిపై ఆసుపత్రి వర్గాలు అధికారికంగా స్పందించాల్సి వుంది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ ప్రకారం, మహారాష్ట్రలో ఇప్పటివరకు 52,667 వైరస్ కేసులు, 1695 మరణాలు నమోదయ్యాయి.

వీటిల్లో సుమారు 40 వేలకు పైగా కేసులు ఆర్థిక రాజధాని, ముంబైలో నమోదైనవే. ఇక్కడ వెయ్యికి పైగా మరణాలతో దేశంలోనే భారీగా ప్రభావితమైన నగరంగా ముంబై నిలిస్తే.. రెండవదిగా ఉన్న పూణే నగరంలో 5319 మంది ప్రాణాంతక వైరస్ బారిన పడ్డారు. ఇకపోతే గతంలో కూడా నితేష్ రాణా ఇలాంటి ఒక షాకింగ్ వీడియోను ట్విటర్‌లో పోస్ట్ చేశారు. కరోనా మృతదేహాల మధ్య కరోనా ఐసోలేషన్ వార్డును నిర్వహిస్తున్న తీరుపై ఆయన మండిపడిన సంగతి తెలిసిందే. చూడాలి మరి దీనిపై మహారాష్ట్ర ప్రభుత్వం ఏ విధంగా స్పందిస్తుందో ..