బీజేపీ సిట్టింగ్ సీటు గోవిందా!

Mon May 03 2021 21:00:01 GMT+0530 (IST)

BJP Lost sitting seat

జీహెచ్ఎంసీలో బీజేపీకి గట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆ పార్టీ సిట్టింగ్ సీటు కోల్పోయింది. లింగోజిగూడ డివిజన్ బీజేపీ కార్పొరేటర్ ఆకుల రమేష్ మరణించడంతో.. తాజా మునిసిపల్ ఎన్నికల్లో ఈ ఉప ఎన్నిక కూడా నిర్వహించారు. అయితే.. ఇక్కడ బీజేపీ అభ్యర్థి ఓడిపోయారు. కాంగ్రెస్ అభ్యర్థి విజయం సాధించారు.బీజేపీ నుంచి మందుగుల అఖిల్ పవన్ గౌడ్ బరిలో నిలవగా.. కాంగ్రెస్ నుంచి దరిపల్లి రాజశేఖర్ రెడ్డి బరిలో నిలిచారు. మరో ఇద్దరు స్వతంత్ర అభ్యర్థులు పోటీచేశారు. అయితే.. వీరందరినీ వెనక్కు నెట్టి కాంగ్రెస్ అభ్యర్థి రాజశేఖర్ రెడ్డి ఘనవిజయం సాధించారు. ఈ గెలుపుతో బల్దియాలో కాంగ్రెస్ కార్పొరేటర్ల సంఖ్య మూడుకు చేరింది.

అయితే.. ఈ ఎన్నికల్లో అధికార టీఆర్ఎస్ పోటీ చేయలేదు. ఈ ఉప ఎన్నిక ఏకగ్రీవం చేయాలని బీజేపీ నేతలు కేటీఆర్ ను కలిసి కోరడంతో.. అంగీకరించిన గులాబీ పార్టీ తమ అభ్యర్థిని నిలపలేదు. దీంతో.. సిట్టింగ్ సీటు తమదే అని భావించింది కమలదళం. కానీ.. కాంగ్రెస్ ఊహించని షాకిచ్చింది. ఈ విజయంలో కాంగ్రెస్ లో నూతనోత్సహం నెలకొంది.