Begin typing your search above and press return to search.

రంగంలోకి బీజేపీ.. మ‌హా రాష్ట్రలో స‌ర్కారు ఏర్పాటు ప‌క్కా!

By:  Tupaki Desk   |   26 Jun 2022 1:30 PM GMT
రంగంలోకి బీజేపీ.. మ‌హా రాష్ట్రలో స‌ర్కారు ఏర్పాటు ప‌క్కా!
X
మ‌హారాష్ట్రలో ఏర్పడిన రాజ‌కీయ సంక్షోభాన్నిత‌మ‌కు అనుకూలంగా మార్చుకునేందుకు బీజేపీ నేత‌లు ముమ్మ‌ర ప్ర‌య‌త్నాలు చేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు `వేచిచూస్తున్నాం!` అంటూ స‌న్నాయి నొక్కులు నొక్కిన నాయ‌కులు తాజాగా త‌మ ప్ర‌భుత్వం ఏర్పాటు చేసుకునేందుకు ఉన్న అవ‌కాశాల‌పై దృష్టి పెట్టారు. క‌ష్ట‌ప‌డి అధికారంలోకి రావ‌డం క‌న్నా.. ఇలా.. దొడ్డిదారిలో అయినా.. అధికారంలోకివ‌చ్చేయాల‌న్న సిద్ధాంతాన్ని బ‌లంగా న‌మ్ముతున్న బీజేపీ.. ఇప్పుడు మ‌హారాష్ట్ర‌లోనూ అదే పంథాను అనుస‌రించ‌నుంది.

రాజకీయ సంక్షోభంలో కూరుకుపోయిన మహారాష్ట్రలో కొత్త ప్రభుత్వ ఏర్పాటుకు తెర వెనుక ప్రయత్నాలు ముమ్మరమయ్యాయి. దీనికి సంబంధించి భారతీయ జనతా పార్టీతో శివసేన అసమ్మతి వర్గం సంప్రదిం పులు జరుపుతున్నట్లు తెలుస్తోంది. ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ సొంత రాష్ట్రం గుజరాత్‌లోని వడోదరలో కీలక చర్చలు జరిగాయని సమాచారం. బీజేపీ సీనియర్‌ నేత, మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడణవీస్‌తో భేటీ కోసం శివసేన తిరుగుబాటు నేత ఏక్‌నాథ్ షిండే గువాహటి నుంచి ప్రత్యేక విమానంలో అక్కడకు వెళ్లి వచ్చినట్లు తెలిసింది.

అదే సమయంలో కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా వడోదరలో ఉన్నారని విశ్వసనీయ వర్గాలు తెలిపాయి. చర్చల సారాంశం ఇంకా అధికారికంగా వెల్లడికాలేదు. కొత్త సర్కారు ఫార్ములాపై ఇరు పక్షాల మధ్య అవగా హన కుదరటానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. ముంబయికి రెబెల్‌ ఎమ్మెల్యేలు తిరిగి రావ డానికి పరిస్థితులు అనుకూలంగా లేవని, మరికొన్నాళ్లు గువాహటిలోనే ఉండాల్సి రావచ్చని తిరుగుబాటు వర్గ నేత ఒకరు వెల్లడించడం గమనార్హం.

మరోవైపున అసమ్మతి వర్గం.. తమ గ్రూప్‌ను 'శివసేన (బాలాసాహెబ్‌)గా' ప్రకటించుకోవడంపై ఉద్ధవ్‌ ఠాక్రే వర్గం మండిపడింది. శివసేన, దాని వ్యవస్థాపకుడు బాల్‌ఠాక్రే పేరును ఉపయోగించుకునే హక్కు ఇతరు లెవరికీలేదని తెలిపింది. ముంబయిలో సమావేశమైన పార్టీ జాతీయ కార్యవర్గం ఆరు తీర్మానాలు చేసింది. రెబెల్‌ ఎమ్మెల్యేలపై చర్యలు తీసుకునేందుకు ఉద్ధవ్‌కు అధికారమిచ్చింది. ఏదేమైనా.. త‌మ పంతం వీడేది లేదని ఏక్‌నాథ్ చెబుతున్నారు. ఈ నేప‌థ్యంలో బీజేపీ అరంగేట్రం చేయ‌డం.. మ‌హారాష్ట్ర‌లో రాజ‌కీయ ప‌రిణామాలు మారిపోవ‌డం ఖాయ‌మ‌నే సంకేతాల‌కు బ‌లం చేకూర్చిన‌ట్టు అయింది.