Begin typing your search above and press return to search.

సుమలతకు బీజేపీ బంపర్ ఆఫర్

By:  Tupaki Desk   |   27 May 2019 7:01 AM GMT
సుమలతకు బీజేపీ బంపర్ ఆఫర్
X
దేశంలో మహిళలు పోటీచేసేదే తక్కువ. అలాంటి చోట ఏకంగా స్టార్ ఇమేజ్ ఉన్న సీనియర్ హీరోయిన్ గెలిస్తే క్రేజ్ ఉండకుండా ఉంటుందా..? ఖచ్చితంగా ఉంటుంది. అందుకే దక్షిణాది హీరోయిన్ సుమలతకు ఇప్పుడు డిమాండ్ ఏర్పడింది. ఎందరు వ్యతిరేకించినా.. స్వయంగా కన్నడ సీఎం కుమారుడు ప్రత్యర్థిగా పోటీచేసినా భయపడకుండా మాండ్యా నుంచి లోక్ సభ బరిలో నిలిచి గెలిచారు సుమలత..

అంబరీష్ చనిపోయాక.. ఆయన స్వస్థలం మాండ్యా సీటు ఖాళీ అయ్యింది. అక్కడి ప్రజల కోరిక మేరకు ఆమె పోటీకి ఆసక్తి చూపగా.. కాంగ్రెస్-జేడీఎస్ లు సీటు ఇవ్వలేదు. దీంతో ఇండిపెండెంట్ గా పోటీచేసి కర్ణాటక సీఎం కుమారుడు నిఖిల్ ను ఓడించింది. కొడుకును కూడా గెలిపించుకోలేని స్థితిలో కుమారస్వామి పరువు పోగా.. సుమలత పేరు దేశవ్యాప్తంగా మారుమోగిపోయింది. సుమలతకు బీజేపీ మద్దతు ఇచ్చి గెలిపించగా.. కన్నడ హీరోలు సపోర్టుగా నిలిచారు.

అయితే సుమలత కర్ణాటకలో గెలిచిన ఇద్దరు మహిళా ఎంపీల్లో ఒకరు కావడం విశేషం. మొత్తం 28 ఎంపీ సీట్లున్న కర్ణాటక రాష్ట్రంలో ఒక సీటులో గెలిచి ఔరా అనిపించారు సమలత. ఇదివరకు ఇందిరాగాంధీ, సోనియాగాంధీ, సినీ నటి రమ్య మాత్రమే కన్నడ నుంచి ఎంపీగా పోటీచేసి గెలిచారు. ఇప్పుడో నాలుగో మహిళా ఎంపీ సుమలత..

లోక్ సభ కు ఎంపీగా గెలిచిన సుమలత ధైర్యం, సాహసాలు కేంద్రంలోని బీజేపీని ఆకర్షించాయి. ఆమె కూడా ఇండిపెండెంట్ గా సీఎం కొడుకును ఓడించడం సంచలనమైంది. అదీకాకుండా మాండ్యాలో బీజేపీ మద్దతు ఇచ్చింది. ఇప్పటికే దేశంలో గెలిచిన మహిళా ఎంపీలు చాలా తక్కువమంది ఉన్నారు. బీజేపీలో అయితే మరీ తక్కువ. అందుకే బీజేపీలో సుమలత చేరితే ఖచ్చితంగా ఆమెకు మంత్రి పదవి ఇవ్వడానికి బీజేపీ అధిష్టానం అనుకూలంగా ఉందని వార్తలు వస్తున్నాయి. మోడీషాలు కూడా సుమలత విషయంలో సానుకూలంగా ఉన్నట్టు తెలిసింది.

దేశంలో బీజేపీ హవా.. భవిష్యత్ దృష్ట్యా సుమలత ఆలోచనలో కూడా మార్పు వస్తోంది. చూడాలి మరి భర్త అనాదిగా ఉన్న కాంగ్రెస్ ను కాదని.. సుమలత బీజేపీలో చేరుతుందా.? కేంద్రమంత్రి అవుతుందా అనేది త్వరలోనే తేలనుంది.