Begin typing your search above and press return to search.

భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల్లో మళ్లీ స్వీప్ చేస్తుందా!

By:  Tupaki Desk   |   19 May 2019 5:08 PM GMT
భారతీయ జనతా పార్టీ ఆ రాష్ట్రాల్లో మళ్లీ స్వీప్ చేస్తుందా!
X
ఇటీవల అసెంబ్లీ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీని కొన్ని చోట్ల ఓడించింది కాంగ్రెస్ పార్టీ. బీజేపీ హవాకు తెర పడిందన్నట్టుగా పలు రాష్ట్రాల్లో కాంగ్రెస్ పార్టీ కోలుకుంది. మధ్య ప్రదేశ్ - రాజస్తాన్ - చత్తీస్ గడ్ రాష్ట్రాల్లో కమలం పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారాన్ని సొంతం చేసుకుంది. కాంగ్రెస్ పార్టీలో ఆ విజయం చాలా ఉత్సాహాన్ని ఇచ్చింది. లోక్ సభ ఎన్నికల్లో కూడా ఆ రాష్ట్రాల్లో కాంగ్రెస్ మెజారిటీ ఎంపీ సీట్లు సాధించే అవకాశం ఉందని విశ్లేషకులు పేర్కొన్నారు. కాంగ్రెస్ వాళ్లు అయితే మరో అడుగు ముందుకు వేసి ఆ రాష్ట్రాల్లో తాము స్వీప్ చేస్తామంటూ ప్రకటించుకున్నారు.

అయితే ఎగ్జిట్ పోల్స్ మాత్రం అంత సీన్ లేదని అంటున్నాయి. అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించిన - గట్టి పోటీని ఇచ్చిన రాష్ట్రాల్లో లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ హవా ఉంటుందని ఎగ్జిట్ పోల్ సర్వేలు చెబుతున్నాయి. ఎంతలా ఉంటే.. ఆ రాష్ట్రాల్లో మళ్లీ కమలం పార్టీ స్వీప్ చేసే అవకాశం ఉందని ఇవి అంచనా వేస్తూ ఉండటం గమనార్హం.

మధ్యప్రదేశ్ - రాజస్తాన్ - చత్తీస్ గడ్ లలో మెజారిటీ ఎంపీ సీట్లను సాధించేది మళ్లీ బీజేపీనే అని ఎగ్జిట్ పోల్ సర్వేలు అంటున్నాయి. గుజరాత్ అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ బీజేపీకి అక్కడ గట్టి పోటీనే ఇచ్చింది. అయితే లోక్ సభ ఎన్నికల వద్దకు వచ్చే సరికి.. అక్కడ బీజేపీ హవా ఉంటుందని.. గుజరాత్ లో బీజేపీ స్వీప్ చేస్తుందని ఎగ్జిట్ పోల్స్ అంచనా వేస్తూ ఉండటం గమనార్హం.

అలాగే బీజేపీ స్వీప్ చేసే మరో రాష్ట్రం కర్ణాటక అని ఎగ్జిట్ పోల్స్ చెబుతున్నాయి. ఆ రాష్ట్రంలో బీజేపీ సత్తా చూపిస్తుందని, కనీసం 25 ఎంపీ సీట్లను నెగ్గే అవకాశం ఉందని పోస్ట్ పోల్ సర్వేలు అంచనా వేస్తూ ఉండటం విశేషం.