Begin typing your search above and press return to search.

దుబ్బాకలో గెలుపోటములు నిర్ణయించేది వీరే!

By:  Tupaki Desk   |   1 Nov 2020 1:30 AM GMT
దుబ్బాకలో గెలుపోటములు నిర్ణయించేది వీరే!
X
తెలంగాణలో జరుగుతున్న దుబ్బాక ఉప ఎన్నిక కాకరేపుతోంది. అధికార టీఆర్ఎస్, బీజేపీ సై అంటే సై అంటుండగా కాంగ్రెస్ కూడా హోరాహోరీగా తలపడుతోంది. దీంతో గెలుపు ఎవరిది? దుబ్బాకలో గెలవడానికి ప్రధాన అవరోధాలు ఏంటి? దుబ్బాకలో ఎవరి ఆధిపత్యం ఉందనేది ఆసక్తిగా మారింది.

దుబ్బాక నియోజకవర్గంలో మొత్తం 7 మండలాలు ఉన్నాయి. 1,98,756 మంది ఓటర్లు ఉన్నారు. ఇందులో మహిళల ఓట్లే ఎక్కువగా ఉన్నాయి. మొదటి నుంచి దుబ్బాక నియోజకవర్గంలో బడుగు బలహీన వర్గాలదే ఆధిపత్యం అని చెప్పొచ్చు. ముఖ్యంగా ఈ నియోజకవర్గంలో ముదిరాజ్, గొల్లకుర్మ, గౌడ కులాలు ఎక్కువగా ఉన్నాయి. ఎస్సీల్లో మాదిగల ప్రభావం ఎక్కువగా ఉంది.

బీసీలు అధికంగా ఉన్నప్పటికీ ఇక్కడ రెండు పర్యాయాలు మాత్రమే బీసీ వర్గానికి చెందిన ఐరేణి లింగయ్య ఎమ్మెల్యేగా గెలిచారు. 1985 నుంచి రెడ్డి సామాజికవర్గానికి చెందిన వ్యక్తులే ఇక్కడ ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్నారు.

దుబ్బాకలో ప్రజల ప్రధాన జీవనాధారంగా వ్యవసాయం ఉంది. వ్యవసాయం తర్వాత బీడీ పరిశ్రమ ద్వారా ఎక్కువమంది ఉపాధి పొందుతున్నారు. 26500 మంది పీఎఫ్ కార్మికులు, మరో 14వేల మంది నాన్ పీఎఫ్ కార్మికులు బీడీ పరిశ్రమను నమ్ముకొని జీవనం సాగిస్తున్నారు.

2009లో దుబ్బాక నియోజకవర్గం ఏర్పాడ్డాక కాంగ్రెస్ నుంచి చెరుకు ముత్యం రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారు. ఆ తర్వాత 2014,2019లో సోలిపేట రామలింగారెడ్డి టీఆర్ెస్ తరుఫున గెలిచారు. ఈ నియోజకవర్గంలో బీసీలు, బీడీకార్మికులు, రైతులే గెలుపోటములను ప్రభావితం చేయనున్నారు.