కోళ్ల దొంగనా.. కన్నీళ్లు పెట్టుకున్న ఎంపీ

Wed Oct 16 2019 17:14:43 GMT+0530 (IST)

సమాజ్ వాదీ రాంపూర్ ఎంపీ.. వివాదాస్పద అజాంఖాన్ తాజాగా బీజేపీ ప్రభుత్వం తనపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోందని కన్నీళ్లు పెట్టుకున్నాడు. అజాంఖాన్ గతంలో బీజేపీని ముఖ్యంగా ఆ పార్టీ నుంచి పోటీచేసి తనపై ఓడిపోయిన జయప్రదను లైంగిక మాటలతో హింసించాడు. సమాజ్ వాదీ అధికారంలో ఉండగా ఈయన ఆగడాలు మాటలకు అడ్డేలేకుండా పోయిందన్న విమర్శలు ఉన్నాయి..తాజాగా ఎంపీగా గెలిచిన అజాంఖాన్ ను బీజేపీ బుక్ చేసింది. ఆయనపై 80కు పైగా కేసులు పెట్టి ముప్పుతిప్పలు పెడుతోంది.   ఈ యూపీ సీనియర్ నాయకుడు అజాంఖాన్ బుధవారం రాంపూర్ అసెంబ్లీకి జరుగుతున్న ఉప ఎన్నికల ర్యాలీలో ప్రసంగించాడు. బీజేపీ పెట్టిన కేసులు తలుచుకొని కన్నీల్లు పెట్టాడు..

తనపై బీజేపీ సర్కారు కోళ్లు మేకల దొంగతనం కేసులు కూడా పెట్టించిందని కన్నీరుమున్నీరయ్యారు. హత్యాయత్నంతోపాటు నేరాలకు పాల్పడితే వెంటనే అరెస్ట్ చేయాలని కానీ తప్పుడు సిల్లీ కేసులతో తనను అభాసుపాలు చేస్తున్నారని బీజేపీపై మండిపడ్డారు.

దేవుడు తాను తప్పు చేస్తే చంపేస్తాడని.. కానీ బతికే ఉన్నానంటే అది బీజేపీ తప్పునేనని అజాంఖాన్ ఎమోషనల్ అయ్యాడు. రాంపూర్ ప్రజల పక్షాన ఈ నిందలు మోస్తున్నానని అజాంఖాన్ చెప్పుకొచ్చాడు.