Begin typing your search above and press return to search.

ఆజాద్ కు పద్మ అవార్డు.. సొంత పార్టీ నేతలే సెటైర్లు

By:  Tupaki Desk   |   26 Jan 2022 11:41 AM GMT
ఆజాద్ కు పద్మ అవార్డు.. సొంత పార్టీ నేతలే సెటైర్లు
X
దేశంలో కాంగ్రెస్ వ్యతిరేకులను ఆకట్టుకునేలా వారికి అవార్డులు, రివార్డులు ప్రకటిస్తూ ప్రధాని మోడీ బుట్టలో పడేస్తున్నారు. ఇప్పటికే తనను విమర్శించిన ఎన్సీపీ అధినేత శరద్ పవార్ కు కూడా పద్మ విభూషణ్ ప్రకటించి మోడీ ఆశ్చర్యపరిచాడు. తాజాగా సోనియాను ఎదురించిన గులాం నబీ ఆజాద్ కు 'పద్మ విభూషణ్' ప్రకటించి సర్ ప్రైజ్ చేశాడు.

మంగళవారం కేంద్రం ప్రకటించిన 'పద్మ' పురస్కారాల్లో కాంగ్రెస్ సీనియర్ నేత గులాంనబీ ఆజాద్ కు పద్మభూషణ్ వరించిన విషయం తెలిసిందే. దీనిపై కాంగ్రెస్ నుంచి సెటైర్లు పడుతున్నాయి. సోనియాకు అత్యంత ఆప్తుడిగా ఉన్న గులాంనబీ ఆజాద్ ఇప్పుడు సోనియాను ఎదురిస్తూ లేఖ రాసి సంచలనం సృష్టించాడు. ఈ క్రమంలోనే మోడీకి దగ్గరయ్యాడన్న గుసగుసలు వినిపించాయి. ఈ క్రమంలోనే గులాం నబీకి మోడీ సర్కార్ అత్యున్నత స్థాయి పౌర పురస్కారాల్లో ఒకటైన పద్మ భూషణ్ అవార్డును ప్రకటించింది.

ఇదే గులాం నబీ ఆజాద్ గతంలో బీజేపీని తిట్టిన తిట్టు తిట్టకుండా తిట్టాడు. వాజ్ పేయి, మోడీ పాలనను లెక్కలోకే తీసుకోకుండా విమర్శించారు. దేశం ఇంత దరిద్రంలోకి వెళ్లడానికి కారణం కాంగ్రెస్ పార్టీ అని మోడీ సైతం తీవ్ర విమర్శలు గుప్పించారు. అలాంటి కాంగ్రెస్ నేతలకు దేశ అత్యున్నత పురస్కారాలు ఇవ్వడం మోడీ కామెడీగా మారింది.

ఇప్పటికే మహారాష్ట్రలో కాంగ్రెస్ తో జతకట్టిన శరాద్ పవర్ కు.. కాంగ్రెస్ ను బతికించుకోవడానికి ఆరాటపడుతున్న ఆజాద్ కూ.. అత్యున్నత పురస్కారాలు అయిపోయాయి. ఇక సోనియాకు కూడా మోడీ ఏదో ఒకరోజు ఇస్తాడని కాంగ్రెస్ నుంచే సెటైర్లు పడుతున్నాయి. సోనియాకు భారతరత్న ఇవ్వాలన్న డిమాండ్ చేయవచ్చని ఎద్దేవా చేస్తున్నారు.

ఇక గులాంనబీ ఆజాద్ కు పద్మ విభూషణ్ ఇవ్వడంపై కాంగ్రెస్ సీనియర్ నేత జైరాం రమేశ్ ట్వీట్ చేశాడు. 'ఇప్పటికే భట్టాచార్య ఈ పురస్కారాన్ని తిరస్కరించడం సరైంది. కానీ గులాం నబీ ఆజాద్.. గులాం (బానిస) ఉండాలనుకోవడం లేదు' అంటూ మోడీకి ఆజాద్ బానిసగా మారాడని పరోక్షంగా విమర్శించాడు.