Begin typing your search above and press return to search.

అయ్యన్న ఫ్యామిలీ టార్గెట్...ఈసారి సీఐడీ నోటీసులతో..

By:  Tupaki Desk   |   1 Oct 2022 10:45 AM GMT
అయ్యన్న ఫ్యామిలీ టార్గెట్...ఈసారి సీఐడీ నోటీసులతో..
X
ఏపీలో వైసీపీ ప్రభుత్వానికి కొరకరాని కొయ్యగా విశాఖ జిల్లాకు చెందిన మాజీ మంత్రి అయ్యన్నపాత్రుడు ఫ్యామిలీ ఉంది. అయ్యన్నపాత్రుడు అయితే తుగ్లక్ ముఖ్యమంత్రి అంటూ జగన్ మీద అనుచిత వ్యాఖ్యలు చేస్తూ బాగానే రెచ్చగొట్టారు. చెత్త పన్ను విధిస్తారా అంటూ ఆయన జగన్ మీద మరో సందర్భంలో పరుష పదజాలం ఉపయోగించారు. ఇలా ఎపుడూ జగన్ మీద కామెంట్స్ చేస్తూ వస్తున్న అయ్యన్నని ఒక్కసారి కూడా అరెస్ట్ చేయలేకపోయామన్న అసంతృప్తి అయితే వైసీపీ పెద్దలలో ఉంది.

అయ్యన్న కోసం చాలా సార్లు పోలీసులు వచ్చినా కూడా ఆయన తనదైన వ్యూహాలతో అరెస్ట్ కాలేదు. ఆ తరువాత కోర్టుకు వెళ్ళి స్టే తెచ్చుకునేవారు. ఇక ఇపుడు అయ్యన్న కుమార్డు విజయ్ పాత్రుడు మీద వైసీపీ గట్టిగానే గురి పెట్టింది. ఆ మధ్యన వైసీపీ ఎంపీ గోరంట్ల మాధవ్ న్యూడ్ వీడియోలు పేరిట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిన సంగతి విధితమే. ఈ విషయంలో వైసీపీ టీడీపీల మధ్య రాజకీయ రచ్చ పెద్ద ఎత్తున సాగింది.

అయితే ఐ టీడీపీ నుంచే న్యూడ్ వీడియో వచ్చిందని, దానికి చింతకాయల విజయ్ కారణమంటూ మాధవ్ అప్పట్లో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ కేసు విషయాన్ని టేకప్ చేసిన సీఐడీ అధికారులు ఇది ఫేక్ వీడియో అని విదేశాల నుంచి వచ్చిదని చెప్పారు. కొన్నాళ్ళు స్తబ్దుగా ఉన్న ఈ వ్యవహారం ఇపుడు మళ్ళీ జోరందుకుంది.

ఈ కేసు విషయంలో విచారణకు హాజరుకావాలని చింతకాయల విజయ్ ని కోరుతూ సీఐడీ అధికారులు ఆయనకు తాజాగా నోటీసులు జారీ చేశారు. విజయ్ నివాసం ఉంటున్న హైదరాబాద్ లో ఆయన ఇంటికి వెళ్తే అక్కడ లేకపోవడంతో ఇంట్లో వారికి నోటీసులు ఇచ్చారు. ఈ నెల 6న ఉదయం పదిన్నర గంటలకు మంగళగిరి సైబర్ క్రైమ్ విభాగంలో విభాగం ఆద్వర్యంలో విచారణకు రావాలని కోరారు.

మొత్తానికి విజయ్ ని విచారణకు పిలిపించి ఈ కేసులో మరింత సమాచారం సేకరించాలని ఏపీ సీఐడీ అధికారులు భావిస్తున్నట్లుగా తెలుస్తోంది. అదే విధంగా విజయ్ మీద పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేసినట్లుగా కూడా తెలుస్తోంది. అయితే దీని మీద నారా లోకేష్ గట్టిగానే రియాక్ట్ అయ్యారు. అయ్యన్న ఫ్యామిలీని టచ్ చేస్తే ఊరుకోమని వైసీపీ సర్కార్ ని ఆయన హెచ్చరించారు.

ఇవన్నీ సరే కానీ ఇంతకీ విజయ్ ఆ రోజున విచారణకు వెళ్తారా అన్న చర్చ అయితే సాగుతోంది. అయ్యన్నపాత్రుడు అరెస్ట్ కాలేదు, జూనియర్ అయ్యన్న విచారణకు సహకరించి వస్తారా లేక తండ్రి బాటలోనే సాగుతారా అన్నది చూడాలని అంటున్నారు. ఒకవేళ సీఐడీ విచారణకు విజయ్ పాత్రుడు హాజరయితే ఆయన్ని అరెస్ట్ చేసే అవకాశాలు ఉంటాయని కూడా అంటున్నారు.

పలు సెక్షన్ల మీద కేసు పెట్టారు కాబట్టి అరెస్ట్ చేయడం ఖాయమని కూడా చెబుతున్నారు. అంటే సీనియర్ అయ్యన్నను ఎటూ అరెస్ట్ చేయలేకపోయామని బాధ పడుతున్న వారు జూనియర్ అయ్యన్నను అరెస్ట్ చేయడం ద్వారా తమ పొలిటికల్ టార్గెట్ రీచ్ అవుతారా అన్నది కూడా ఆసక్తిరేపుతున్న అంశం. చూడాలి మరి ఏం జరుగుతుందో.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.