Begin typing your search above and press return to search.

ఆసీస్​ బాల్​ టాంపరింగ్​.. తెరమీదకు సంచలన నిజాలు..!

By:  Tupaki Desk   |   18 May 2021 4:30 AM GMT
ఆసీస్​ బాల్​ టాంపరింగ్​.. తెరమీదకు సంచలన నిజాలు..!
X
ఆస్ట్రేలియా క్రికెటర్లను బాల్​ టాంపరింగ్​ వ్యవహారం ఇప్పటికీ వదలడం లేదు. గతంలో ఆస్ట్రేలియాలో బాల్​ ట్యాంపరింగ్​ జరిగిన విషయం తెలిసిందే. దీంతో కెప్టెన్ స్మిత్​, వైస్​ కెప్టెన్​ డేవిడ్​ వార్నర్​ పై ఏడాది పాటు వేటు పడింది. అప్పట్లో ఈ అంశం ప్రపంచవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించింది. డేవిడ్​ వార్నర్​, స్మిత్​ పై తీవ్ర స్థాయిలో విమర్శలు వచ్చాయి. అయితే ఈ మొత్తం వ్యవహారంతో బాన్​క్రాఫ్ట్​ ప్రధాన సూత్రదారిగా తేలిన విషయం తెలిసిందే. ఇటీవల అతడు సంచలన విషయాలు వెల్లడించాడు. మరోవైపు ఆసీస్​ మాజీ క్రికెటర్​ గిల్​క్రిస్ట్​ తాజాగా ఈ వివాదంపై స్పందించాడు.

’ బాల్​ టాంపరింగ్​ గురించి బాన్​క్రాస్ట్​, డేవిడ్​ వార్నర్​, స్మిత్ తో పాటు చాలా మందికి ముందే తెలుసు. ఇది అంత సీక్రెట్​ గా జరిగిన వ్యవహారం ఏమీ కాదు. బాల్​ ట్యాంపరింగ్​ వ్యవహారం, సాండ్​ పేపర్​ వాడిన విషయం ముందే చాలా మంది బౌలర్లకు తెలుసని బాన్​క్రాఫ్ట్​ పేర్కొన్నాడు. అయితే ఈ విషయంపై తాజాగా గిల్​క్రిస్ట్​ మాట్లాడుతూ.. బాల్​ ట్యాంపరింగ్​ చాలా మంది బౌలర్లకు ముందే తెలుసు. కానీ ఆ పేర్లను వెల్లడించే సమయం కోసం నేను వేచి చూస్తున్నా’ అంటూ గిల్​ క్రిస్ట్​ పేర్కొన్నాడు. దీంతో ఈ వ్యవహారం సంచలనంగా మారింది. బాల్​ట్యాంపరింగ్​ వ్యవహారంలో డేవిడ్​ వార్నర్​, స్మిత్​, బాన్​క్రాప్ట్​ పేర్లు మాత్రమే ముందు తెరమీదకు వచ్చాయి. వాళ్లు మాత్రమే దోషులుగా తేలారు.

కానీ తాజాగా జరుగుతున్న పరిణామాలు చూస్తూంటే ఇంకా చాలా మంది క్రికెటర్ల పేర్లు తెరమీదకు వచ్చే అవకాశాలు కన్పిస్తున్నాయి. అయితే ఈ వివాదంపై వార్నర్​ మేనేజర్​ జేమ్స్​ కూడా స్పందించాడు. ’ బాల్​ ట్యాంపరింగ్​ వ్యవహారంలో జరిగిన విచారణ మొత్తం ఏకపక్షంగా సాగింది. వార్నర్​, స్మిత్​ మాత్రమే దోషులుగా తేలారు. కానీ విచారణ పారదర్శకంగా సాగిఉంటే ఇంకా చాలా మంది దోషులుగా తేలేవారు. ఈ వ్యవహారంపై కోర్టుకు వెళితే కచ్చితంగా న్యాయం జరిగేది’ అంటూ పేర్కొన్నారు.ఓ వైపు గిల్​క్రిస్ట్​ వ్యాఖ్యలు.. మరోవైపు జేమ్స్​ వ్యాఖ్యలు ఆస్ట్రేలియా క్రికెట్ ​ను ఓ కుదుపు కుదుపేశాయి. ఇంకా ఎంత మంది పేర్లు తెరమీదకు వస్తాయోమోనని కొందరు క్రికెటర్లలో గుబులు ఏర్పడుతోంది.