Begin typing your search above and press return to search.

వైద్యులపై ఉమ్మి.. రాళ్లతో దాడి.. కరోనా బాధితుల దుర్మార్గం

By:  Tupaki Desk   |   2 April 2020 4:50 AM GMT
వైద్యులపై ఉమ్మి.. రాళ్లతో దాడి.. కరోనా బాధితుల దుర్మార్గం
X
దేశవ్యాప్తంగా కరోనా విస్తరిస్తోంది. ఇప్పటికే 1500 పాజిటివ్ కేసులకు చేరువైంది. ఇటీవల ఢిల్లీ నిజాముద్దీన్ లో జరిగిన మర్కజ్ ప్రార్థనలకు వెళ్లివచ్చిన వారికే ఎక్కువగా కరోనా సోకింది.

ఈ నేపథ్యంలో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఆ మత ప్రార్థనల సమావేశాలకు ఎవరెవరు హాజరయ్యారన్న దానిపై వేగంగా దర్యాప్తు చేస్తున్నారు. వారిని గుర్తించి వారికి చికిత్సనందించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ కరోనా అనుమానితుల ఆగడాలు మాత్రం తాజాగా శృతిమించాయి.

తాజాగా ఢిల్లీ ప్రార్థనలకు వెళ్లి వచ్చిన తబ్లిగీ కార్యకర్తల తీరుపై వైద్యులు భయాందోళనలకు గురవుతున్నారు. తాజాగా ఢిల్లీలోని ఆర్పీఎఫ్ బ్యారెక్ తోపాటు డిజిల్ షెడ్ ట్రైనింగ్ స్కూల్లో ఈ తబ్లిగీ జమాత్ కార్యకర్తలను క్వారంటైన్ లో ఉంచారు. అయితే వీరు వైద్యం చేసేందుకు వచ్చే డాక్టర్లపై ఉమ్మివేస్తూ వికృత చేష్టలకు దిగుతున్నారని సీపీఆర్వో దీపక్ కుమార్ తెలిపారు. క్వారంటైన్ లో ఉండకుండా ఎక్కడ పడితే అక్కడ తిరుగుతూ వైద్యులపై ఉమ్ముతూ నానా బీభత్సం సృష్టిస్తున్నారని.. గొడవ చేస్తున్నారని తెలిపారు.

ఇక మధ్యప్రదేశ్ లోని ఇండోర్ లో గల తట్ పట్టిభాకల్ ప్రాంతంలో ఇలాంటి ఉపద్రవమే చోటు చేసుకుంది. ఢిల్లీలో మత ప్రార్థనలకు వెళ్లివచ్చిన కరోనా పేషెంట్ అనుమానితుడిని ఆస్పత్రికి తీసుకెళ్లడానికి వచ్చిన ఇద్దరు మహిళా డాక్టర్లు, వైద్య సిబ్బందిపై స్థానికులు రాళ్ల వర్షాన్ని కురిపించారు. వారిని రాళ్లు, కర్రలతో తరిమికొట్టారు. ఈ వీడియో వైరల్ అయ్యింది. ప్రభుత్వం సీరియస్ అయ్యింది.

ఈ ఘటనపై వైద్యాధికారులు పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు. కరోనా రోగులను కాపాడడానికి శ్రమిస్తున్న డాక్టర్ల పై దాడి చేయడం సరికాదన్నారు. వైద్య సిబ్బందికి రక్షణ కల్పిస్తామని డీజీపీ తెలిపారు. రాళ్ల దాడి చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు.