Begin typing your search above and press return to search.

చంద్ర‌బాబు ఇంటిపై దాడి.. త‌మ్ముళ్లకు బిగ్ రిలీఫ్‌!

By:  Tupaki Desk   |   23 Sep 2021 10:34 AM GMT
చంద్ర‌బాబు ఇంటిపై దాడి.. త‌మ్ముళ్లకు బిగ్ రిలీఫ్‌!
X
టీడీపీ అధినేత చంద్ర‌బాబు ఇంటిపై వైసీపీ ఎమ్మెల్యే జోగి ర‌మేష్ త‌న ప‌రివారంతో దాడికి వెళ్లిన విష యం తెలిసిందే. ఈ క్ర‌మంలో జోగిని అడ్డుకోబోయిన‌.. టీడీపీ నేత‌ల‌కు.. వైసీపీ నేత‌ల‌కు మ‌ధ్య తీవ్ర వివాదం చోటు చేసుకుంది. వాస్త‌వానికి జ‌డ్ కేట‌గిరీ భ‌ద్ర‌త‌లో ఉన్న త‌మ నాయ‌కుడి ఇంటి వ‌రకు వైసీపీ ఎమ్మెల్యేను ఎలా అనుమ‌తించార‌నేది టీడీపీ నేత‌ల ప్ర‌శ్న‌.. తాము.. అడ్డుకుని ఉండ‌క‌పోతే.. చంద్ర‌బాబు ప్రాణాల‌కే ముప్పు వ‌చ్చేద‌ని కూడా వారు ఆందోళ‌న వ్య‌క్తం చేశారు. ఈ క్ర‌మంలో ఇటు.. చంద్ర‌బాబు ఇంటి వ‌ద్ద‌.. త‌మ్ముళ్లు వైసీపీ నేత‌ల‌ను అడ్డుకున్నారు.

అదేస‌మ‌యంలో డీజీపీ గౌతం స‌వాంగ్‌కు ఫిర్యాదు చేసేందుకు వెళ్లారు. అయితే.. ఈ రెండు ఘ‌ట‌న‌ల‌కు సంబంధించి గుంటూరు పోలీసులు టీడీపీ నేత‌ల‌పై కేసులు న‌మోదు చేశారు. ఏకంగా.. వీరిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు కూడా న‌మోదు చేశారు. మొత్తం ఆ ఘ‌ట‌న‌లో పాల్గొన్న ప్ర‌తి ఒక్క‌రిపైనా కేసులు పెట్ట‌డం గ‌మ‌నార్హం. ముఖ్యంగా పార్టీ నాయ‌కుడు నాదెండ్ల బ్ర‌హ్మంపై మ‌రిన్ని కేసులు పెట్టారు. నిజానికి ఎందుకు ఇవి పెట్టారో.. పోలీసుల‌కు కూడా తెలియ‌దంటే.. ఆశ్చ‌ర్యం వేస్తుంది. ఎందుకంటే.. చంద్ర‌బాబుపై దాడి చేసేందుకు వెళ్లింది జోగి ర‌మేష‌ని టీడీపీ నాయ‌కులు చెబుతున్నారు.

మ‌రి జోగి ర‌మేష్ బీసీ వ‌ర్గానికి చెందిన నాయ‌కుడు. పోనీ.. టీడీపీ త‌ర‌ఫున ఎవ‌రైనా ఎస్సీ నాయ‌కులు ఉ న్నారా? అంటే.. అది కూడా లేదు. బుద్దా వెంక‌న్న బీసీ నాయ‌కుడు. అయిన‌ప్ప‌టికీ.. దూషించారంటూ.. పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసులు పెట్టారు. దీంతో ఈ ప‌రిణామంపై టీడీపీ నాయ‌కులు కోర్టును ఆశ్ర‌యించా రు. దీనిపై తాజాగా విచార‌ణ జ‌రిగిన కోర్టు.. టీడీపీ త‌ర‌ఫున వాద‌న‌లు వినిపించిన సీనియ‌ర్ న్యాయ‌వాదు లు పోసాని వెంక‌టేశ్వ‌ర్లు.. కృష్ణారెడ్డిల వాద‌న‌ల‌ను ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంది.

టీడీపీ నేత‌ల‌పై పోలీసులు న‌మోదు చేసిన కేసుల తీవ్ర‌త ఎక్కువ‌గా ఉంద‌ని ప్రాథ‌మికంగా కోర్టు అభిప్రాయానికి వ‌చ్చింది. అయితే.. ప్ర‌భుత్వం త‌ర‌ఫు లాయ‌ర్ ఏకంగా.. డీజీపీ ఆఫీస్ పై దాడి చేసేందుకు వ‌చ్చారంటూ.. వాద‌న‌లు వినిపించారు. దీంతో టీడీపీనేత‌ల‌పై పెట్టిన కేసుల్లో త‌క్ష‌ణం ఎలాంటి చ‌ర్య‌లూ తీసుకోవ‌ద్ద‌ని.. 41 ఏ(విష‌య నిర్ధార‌ణ‌) సెక్ష‌న్ కింద తొలుత నోటీసులు ఇచ్చి.. వారిని విచారించిన త‌ర్వాతే.. కేసులు న‌మోదు చేయాల‌ని పోలీసుల‌ను ఆదేశించింది. దీంతో ఇప్ప‌టికైతే.. టీడీపీ నాయ‌కుల‌కు రిలీఫ్ ల‌భించిన‌ట్టేన‌ని.. వారి త‌ర‌ఫున న్యాయ‌వాదులు పేర్కొన్నారు.