Begin typing your search above and press return to search.

డేటింగ్ యాప్ తో దారుణంః అమ్మాయిని హోటల్ కు పిలిచి..

By:  Tupaki Desk   |   29 July 2021 3:11 PM GMT
డేటింగ్ యాప్ తో దారుణంః  అమ్మాయిని హోటల్ కు పిలిచి..
X
సిటీ క‌ల్చ‌ర్ లో వేగ‌వంత‌మైన మార్పులు వ‌స్తున్నాయి. ఆడ, మ‌గ మ‌ధ్య ఫారెన్ క‌ల్చ‌ర్ వేగంగా డెవ‌ల‌ప్ అవుతోంది. లివింగ్ రిలేష‌న్ షిప్, వ‌న్ నైట్ స్టాండ్ వంటి బంధాలు విస్తృతం అవుతున్నాయి. ఇలాంటి వాటికి వేదిక అవుతున్నాయి డేటింగ్ యాప్స్. కొత్త‌వారితో స్నేహం పెంచుకోవ‌డం.. ఇద్ద‌రూ క‌మిట్ అయితే.. ఏదో ఒక రిలేష‌న్ స్టార్ట్ చేయ‌డం జ‌రిగిపోతోంది. అయితే.. ఇలాంటి యాప్ ల‌తో మోసాలు, దారుణాలు కూడా జ‌రుగుతున్నాయి.

తాజాగా.. ముంబైకి చెందిన ఒక యువ‌తి డేటింగ్ లో మెంబ‌ర్ షిప్ తీసుకుంది. ఆమెకు నెల రోజుల క్రితం ఒక యువ‌కుడు ప‌రిచ‌యం అయ్యాడు. వీరిద్ద‌రూ చాటింగులు చేసుకుంటున్నారు. ఈ క్ర‌మంలో జూలై 26న ఆమె బ‌ర్త్ డే కావ‌డంతో.. న‌గ‌రంలోని ఓ హోట‌ల్లో బ‌ర్త్ డే పార్టీ ప్లాన్ చేశాడా యువ‌కుడు. గ్రాండ్ గా బ‌ర్త్ డే పార్టీ సెల‌బ్రేట్ చేసుకుందాం ర‌మ్మ‌ని పిలిచాడు. దీంతో.. స‌ద‌రు అమ్మాయి అక్క‌డికి వెళ్లింది.

అయితే.. అమ్మాయిపై క‌న్నేసిన స‌ద‌రు యువ‌కుడు.. ముంద‌స్తు ప్లాన్ వేశాడు. మ‌త్తు మందు క‌లిపిన గ్లాస్ ఇచ్చాడు. అది తాగిన యువ‌తి మ‌త్తులోకి వెళ్లిపోయింది. అనంత‌రం నిందితుడు ఆమెపై అత్యాచారానికి పాల్ప‌డ్డాడు. మెల‌కువ వ‌చ్చిన‌ త‌ర్వాత అస‌లు విష‌యం తెలుసుకున్న బాధితురాలు పోలీసుల‌కు వివ‌రాలు తెలిపింది. దీంతో.. నిందితుడిపై కేసు న‌మోదు చేసి ద‌ర్యాప్తు చేప‌ట్టారు.