Begin typing your search above and press return to search.

9 నెలల గర్భంతో పరుగు పోటీ.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే

By:  Tupaki Desk   |   19 Oct 2020 4:45 AM GMT
9 నెలల గర్భంతో పరుగు పోటీ.. వీడియో చూస్తే మతి పోవాల్సిందే
X
తొమ్మిది నెలల గర్భం. ఇక.. చెప్పాల్సిన అవసరం లేని పరిస్థితి. నిండు గర్భంతో నడవటానికే ఇబ్బంది పడేవారెందరో. ఇక.. వేగంగా అడుగులు వేయాలంటే కిందా మీదా పడిపోతారు. అలాంటిది.. ఒక మహిళా అథ్లెట్..ఎవరికి సాథ్యం కాని రికార్డును క్రియేట్ చేసి సంచలనంగా మారింది. ఒక పరుగు పోటీలో ఆమె రికార్డు సమయంలో పరుగును పూర్తి చేసిన వీడియో ఒకటి ఇప్పుడు వైరల్ గా మారింది. అందరిని ఆశ్చర్యపోయేలా చేస్తున్న ఆమె ఫిట్ నెస్ కు మతిపోవాల్సిందే. ఇంతకూ ఆమె ఎవరు? ఏం చేసింది? అన్న విషయంలోకి వెళితే..

28 ఏళ్ల మకెన్నా మైలర్ ఒక అథ్లెట్. దానికి తోడు నిండు గర్భిణి. ఈ పరిస్థితుల్లో పరుగు పోటీ పెట్టుకున్నారు. రోజుల్లో డెలివరీ అయ్యే వేళలో పరుగు పోటీనా? అన్న ఆశ్చర్యం అక్కర్లేదు. తనకున్న ఫిట్ నెస్ తో ఎలాంటి సమస్యలు రావని బలంగా నమ్మిన ఆమె గ్రౌండ్ లోకి అడుగు పెట్టారు. ఆమె ప్రయత్నాన్ని.. మకెన్నా భర్త దగ్గరుండి ప్రోత్సహించారు.

సాధారణంగా ఆరోగ్యవంతులు 1.6 కిలోమీటర్ల దూరాన్ని పరుగు తీయటానికి తొమ్మిది నుంచి పది నిమిషాల సమయం తీసుకుంటారు. అలాంటిది ఆమె మాత్రం కేవలం 5 నిమిషాల 25 సెకన్లలో తన పరుగును పూర్తి చేసి అందరిని ఆశ్చర్యపోయేలా చేశారు. కొంత మంది ఉత్సాహంతో ఇలాంటి ప్రయత్నాలు చేయటం.. తర్వాత అనారోగ్యానికి గురై విమర్శల్ని ఎదుర్కొంటారు.

అందుకు భిన్నంగా మకెన్నా మాత్రం ఎలాంటి ఇబ్బందులకు గురి కాలేదట. ఫిట్ నెట్ మీద ప్రత్యేక శ్రద్ధ తీసుకోవటం.. కరోనా పరిస్థితుల కారణంగా గర్భం దాల్చటంతో తన ట్రైనింగ్ లో మార్పులు చేసుకున్నట్లు చెబుతున్నారు. అయితే.. ఆమె ఈ అరుదైన ఫీట్ ను చేపట్టటానికి ముందు వైద్యుల సలహాలు.. సూచనలు తీసుకున్నారు. వైద్యులు కూడా ఆమె పరుగు వేళ.. మైదానంలోనే ఉండి చూసుకోవటం గమనార్హం. పరుగును రికార్డు సమయంలో పూర్తి చేసిన అనంతరం.. ఆమె స్పందిస్తూ.. తాను సైతం ఇలాంటి ఫలితాన్ని ఊహించలేదని పేర్కొన్నారు.

పరుగు పందెంలో ప్రతి వారం పొల్గొనేదానినని.. తొమ్మిది నెలల గర్భంలో ఉన్నప్పుడు మాత్రం ఎందుకు ఆపాలని తాను అనుకున్నానని.. ప్రయత్నం చేసినట్లు చెబుతున్నారు. ఆమె పరుగుకు సంబంధించిన వీడియో ఇప్పుడు వైరల్ గా మారటమే కాదు.. వీడియో చూస్తున్నంతసేపు ఊపిరి పీల్చుకోవటం మరిచిపోయే పరిస్థితి. వాస్తవానికి ఆమెకు డెలివరీ డేట్ కు కాస్త ముందుగానే ఆమె ఈ అరుదైన్ ఫీట్ ను పూర్తి చేశారు. ఆమె చేసిన ప్రయత్నంతో సోషల్ మీడియాలో ఆమె మీద ఆసక్తికర చర్చ నడుస్తోంది.