Begin typing your search above and press return to search.

లంచం అడ‌గ‌డం నేరం కాదు!... కేర‌ళ హై కోర్టు

By:  Tupaki Desk   |   5 Dec 2022 1:30 PM GMT
లంచం అడ‌గ‌డం నేరం కాదు!... కేర‌ళ హై కోర్టు
X
ప్ర‌భుత్వ ఉద్యోగుల‌కు కేర‌ళ హైకోర్టు బిగ్ రిలీఫ్ క‌ల్పించింది. ఉద్యోగులు లంచం డిమాండు చేయ‌డం త‌ప్పేమీ కాద‌ని సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేసింది. అయితే లంచం తీసుకోవ‌డం మాత్రం నేర‌మ‌ని స్ప‌ష్టం చేసింది. కేర‌ళ హై కోర్టు చేసిన వ్యాఖ్య‌లు వైర‌ల్ అవుతున్నాయి.

చిత్ర‌దుర్గ‌కు చెందిన ఒక వ్య‌క్తి నుంచీ ప్ర‌భుత్వ ఉద్యోగి ఒక‌రు రూ.5000 లంచం డిమాండు చేశారు. దాంతో ఆ వ్య‌క్తి ఆ ఉద్యోగిపైన అవినీతి నిరోధ‌క శాఖ (ఏసీబీ) వారికి ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదుపైన స్పందించిన ఏసీబీ అధికారులు ఆ ఉద్యోగి ప‌నిచేస్తున్న కార్యాల‌యంపై దాడులు నిర్వ‌హించారు.

ఏసీబీ వారు దాడి చేసిన స‌మ‌యంలో ఆ ఉద్యోగి టేబుల్‌పైన తాను డిమాండు చేసిన లంచం సొమ్ము తాలూకూ డ‌బ్బు క‌ట్ట ఉంది. అయితే ఆ ఉద్యోగి వాటిని తాక‌లేదు. దాంతో అది లంచం కింద‌కు రాద‌ని, ఆ డ‌బ్బును ఆ ఉద్యోగి తాకితేనే లంచం కింద‌కు వ‌స్తుంద‌ని కేర‌ళ హైకోర్టు స్ప‌ష్టం చేసింది.

ప్ర‌భుత్వు ఉద్యోగి లంచం డిమాండు చేయ‌డం త‌ప్పు కాద‌ని, కానీ ఆ ఉద్యోగి లంచం తీసుకోవ‌డం మాత్రం నేర‌మే అవుతుంద‌ని చెప్పింది.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.