హిందీ వచ్చినవారే భారతీయులా..?: కనిమొళి ఆవేదన

Sun Aug 09 2020 19:31:48 GMT+0530 (IST)

Asked if I am Indian for not speaking in Hindi at airport

కేరళలోని కోజికోడ్ లో ఎయిర్ పోర్ట్ కు వెళ్లిన డీఎంకే నేత లోక్ సభ ఎంపీ కనిమొళికి చేదు అనుభవం ఎదురైంది. ఆ ఘటన స్థలంలో విధులు నిర్వహిస్తున్న ఉత్తర భారతానికి చెందిన సీఐఎస్ఎఫ్ కు చెందిన ఓ మహిళా జవాన్ కనిమొళిని గుర్తు పట్టకుండా తీవ్రంగా అవమానించారు.కనిమొళిని పట్టుకొని ‘మీరు భారతీయులేనా’ అని ప్రశ్నించా అవమానించింది ఆ మహిళా జవాన్. ఈ విషయాన్ని కనిమొళి ట్విట్టర్ లో వెల్లడించి వాపోయింది.

కేరళలోని కోజికోడ్ లో జరిగిన విమాన ప్రమాదం సందర్భంగా ఈ ఉదయం కనిమొళి అక్కడికి వెళ్లింది.  అక్కడ విధుల్లో ఉన్న ఓ సీఐఎస్ఎఫ్ మహిళా జవాన్ హిందీలో  ఏదో చెప్పింది. దానికి తనకు హిందీ రాదని.. తమిళం లేదంటే ఇంగ్లీష్ లో మాట్లాడాలని సూచించానని కనిమొళి తెలిపారు. దానికి ఆ మహిళా జవాన్ ‘హిందీ తెలియదా? ఇంతకూ మీరు భారతీయులేనా’ అని ఆమె తనను ప్రశ్నించిందని కనిమొళి వాపోయింది.

హిందీ భాష వచ్చిన వారు భారతీయులు అన్నట్టేనా? అని ఎంపీ ట్విట్టర్ లో ప్రశ్నించారు. దక్షిణాది రాష్ట్రాలపై కేంద్ర సర్కార్ బలవంతంగా హిందీని రుద్దాలని చూస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ‘హిందీఇంపోజిషన్’ అని హ్యాష్ ట్యాగ్ ను వైరల్ చేశారు.