Begin typing your search above and press return to search.

ఆసిఫాబాద్‌ లో మరో దిశ..ఎన్ కౌంటర్ కి డిమాండ్ చేస్తున్న బాధితులు!

By:  Tupaki Desk   |   10 Dec 2019 8:35 AM GMT
ఆసిఫాబాద్‌ లో మరో దిశ..ఎన్ కౌంటర్ కి డిమాండ్ చేస్తున్న బాధితులు!
X
హైదరాబాద్ నగర్ శివారులో జరిగిన వెటర్నరీ డాక్టర్ దిశ ఉదంతం దేశ వ్యాప్తంగా ఎంత సంచలనం సృష్టించిందో అందరికి తెలిసిందే. ఆ తరువాత పోలీసులు దిశ కేసులోని నిందుతులని ఎన్ కౌంటర్ చేయడంతో ప్రజలు పోలీసులపై హర్షం వ్యక్తం చేసారు. ఆడవారి పై అఘాయిత్యాలకు పాల్పడే ప్రతిఒక్కరికి కూడా ఇలాంటి శిక్షలే వేయాలని ప్రతి ఒక్కరూ కోరుకుంటున్నారు. ఇకపోతే దిశ అత్యాచారం - హత్య ఘటన జరగడానికి మూడు రోజుల ముందు జరిగిన ఓ ఘటన ఇప్పుడు వెలుగులోకి వచ్చింది. పూర్తి వివరాలు చూస్తే ..

ఆసిఫాబాద్‌ లోని లింగాపూర్‌ కు చెందిన ఓ దళిత మహిళను గుర్తు తెలియని కొందరు దుండగులు అపహరించి చెట్టు పొదల్లోకి తీసుకెళ్లి అత్యాచారం చేసి.. ఆపై హత్య చేశారు. నవంబర్ 24న ఈ ఘటన జరిగినట్లు భావిస్తుండగా.. పోలీసులు ఆ బాధితురాలి పేరును ‘సమత’గా నామకరణం చేసారు. ఇకపై అందరూ కూడా ఆ బాధితురాలిని ‘సమత’గా పిలవాలని సూచించారు. ఈ అఘాయిత్యానికి పాల్పడిన ముగ్గురు నింధితులు షేక్ బాబు - షేక్ షాబొద్దిన్ - షేక్ మఖ్దూంగాలను పోలీసులు అరెస్ట్ చేశారు.

ఈ కేసు సంబంధించి ఛార్జ్ షీట్‌ను వారం రోజుల్లో దాఖలు చేసి.. విచారణకు ఫాస్ట్ ట్రాక్ కోర్టు ఏర్పాటు చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారు. అంతేకాకుండా బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం నుంచి ఆర్ధిక సహాయం అందేలా చూస్తామని.. నిందితులకు కఠిన శిక్షలు పడేలా చేస్తామన్నారు. కాగా, దిశ ఘటనలో నిందితులను ఎన్‌ కౌంటర్ చేసిన విధంగా.. దళిత మహిళపై అత్యాచారానికి పాల్పడినవారిని కూడా ఎన్‌కౌంటర్ చేయాలన్న డిమాండ్లు పెరిగిపోతున్నాయి.