చర్చకు గడ్డానికి సంబంధం ఏంది ఓవైసీ సాబ్?

Wed Jan 22 2020 21:34:11 GMT+0530 (IST)

Asaduddin Owaisi chalenges Amir Shah

కేంద్ర హోంమంత్రి అమిత్‌షాకు ఏఐఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర సవాల్ విసిరారు. మంగళవారం లక్నోలో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్న అమిత్ షా మాట్లాడుతూ పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ)పై రాహుల్ గాంధీ మమతా బెనర్జీ అఖిలేష్ యాదవ్ లేదా మాయావతి ఎవరైనా సరే.. తనతో బహిరంగంగా చర్చకు రావాలని సవాల్ విసిరారు. దీనిపై ఓవైసీ స్పందిస్తూ వారితో చర్చ ఎందుకు.. నాతో చర్చకు రండి అని ప్రతి సవాల్ విసిరారు.కరీంనగర్‌లో జరిగిన ఓ ర్యాలీలో ప్రసంగించిన అసదుద్దీన్ ఓవైసీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ``నేనిక్కడే ఉన్నాను. అమిత్‌షా గారు...ఒక గడ్డం వ్యక్తి (ముస్లిం)తో డిబేట్‌కు రండి.. సీఏఏ - ఎన్ పీఆర ఎన్నార్సీ.. వీటిపై నేను చర్చకు రెడీ.. మీ ప్రశ్నలకు నేను సరైన సమాధానం చెబుతాను ‘ అని సవాల్ విసిరారు. కాగా సీఏఏపై ముస్లింలతో చర్చించాలంటున్న ఓవైసీ ఈ చట్టానికి వ్యతిరేకంగా కొందరు హిందు మతస్థులు కూడా పోరాడుతున్న దానికి ఎలాంటి సమాధానం చెప్తారో అంటూ నెట్టింట చర్చ జరుగుతోంది.

ఇదిలాఉండగా ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను సైతం ఓవైసీ ప్రస్తావించారు. బడ్జెట్ సందర్భంగా జరిగే సంప్రదాయ హల్వా వేడుకను ప్రస్తావిస్తూ ``కొన్ని నగరాలు వీధుల పేర్లు మారుస్తామని బీజేపీ ప్రకటిస్తుంది. బడ్జెట్ సందర్భంలోని హల్వా అనే పేరు ఎక్కడ్నించి వచ్చిందని వారిని నేను అడుగుతున్నాను. అది అరబిక్ పదం. హిందీ కాదు ఉర్దూ కాదు. ఇప్పుడు ఆ అరబిక్ పదాన్ని కూడా తొలగించండి. . ఇదే పదాన్ని వినియోగిస్తున్నారంటే మీరు అరబ్ దేశస్థులా అని ఆయన సూటిగా వ్యాఖ్యానించారు.` అని ఓవైసీ ప్రశ్నించారు.