Begin typing your search above and press return to search.

గ్రేటర్ లో బీజేపీ ప్రచారంపై ఓవైసీ గట్టి కౌంటర్

By:  Tupaki Desk   |   26 Nov 2020 3:30 AM GMT
గ్రేటర్ లో బీజేపీ ప్రచారంపై ఓవైసీ గట్టి కౌంటర్
X
గ్రేటర్ ఎన్నికల వేళ బీజేపీపై విమర్శలు ఎక్కుపెట్టారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఓవైసీ. బీజేపీ తీవ్ర వ్యాఖ్యలకు గట్టి కౌంటర్లు ఇస్తున్నారు. ఎన్నికలు వచ్చినప్పుడే బీజేపీకి రోహింగ్యాలు, పాకిస్తాన్ గుర్తుకు వస్తాయని అసదుద్దీన్ ఓవైసీ తాజాగా నిప్పులు చెరిగారు.

వరద బాధితులకు కేంద్రం ఒక్క పైసా సాయం అందించలేదని ఓవైసీ మండిపడ్డారు.. హైదరాబాద్‌లో గొడవలు సృష్టించేందుకే బీజేపీ ప్రయత్నిస్తోందని ఆరోపించారు. గ్రేటర్ ఎన్నికల్లో బీజేపీ మోదీ ఫోటో కాకుండా తన ఫోటోతో ఓట్లు అడుగుతోందని ఎద్దేవా చేశారు. చైనాపై సర్జికల్ స్ట్రైక్ చేసే ధైర్యం బీజేపీకి లేదని... అలా చేస్తే తాను కూడా కేంద్రాన్ని ప్రశంసిస్తామని అసదుద్దీన్ పేర్కొన్నారు.

పాత బస్తీలో వారు ఉంటే ఆరేళ్లుగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం ఏం చేస్తోందని ఓవైసీ ప్రశ్నించారు. పాతబస్తీలో రోహింగ్యాలు ఉన్నా పట్టించుకోని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి కిషన్ రెడ్డి బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల వేళ బీజేపీ తరుపున ప్రచారానికి కేంద్రమంత్రులంతా హైదరాబాద్‌లో దిగుతున్నారని... వరదల సమయంలో వీళ్లంతా ఎందుకు ఇక్కడికి రాలేదని ప్రశ్నించారు.

కాగా పాతబస్తీపై సర్జికల్ స్ట్రైక్ చేస్తామని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఆరోపించిన సంగతి తెలిసిందే. మేయర్ పీఠం గెలిస్తే రోహింగ్యాలు, పాకిస్తానీలను తరిమికొడతామని బండి హెచ్చరించారు. ఈ క్రమంలోనే ఓవైసీ బీజేపీపై విరుచుకుపడ్డారు. మత విద్వేశాలను ప్రోత్సహిస్తోందని మండిపడ్డారు.