Begin typing your search above and press return to search.

మన విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!!

By:  Tupaki Desk   |   9 July 2020 5:30 PM GMT
మన విద్యార్థులకు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్!!
X
మన విద్యార్థులను కూడా మారుతున్న కాలానికి అనుగుణంగా మార్చాలని కేంద్రం సంకల్పించింది. ప్రస్తుతం ప్రపంచంలో సాంకేతికత వేగంగా మారిపోతోంది. ఈ నేపథ్యంలోనే మన భావి ఇంజినీర్లను కూడా వాటిని అందిపుచ్చుకునేలా తయారు చేయాలని కేంద్రం సంకల్పించింది.

ఈ క్రమంలోనే దేశంలో పలు ఇంజినీరింగ్ కాలేజీల్లో ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐ-మెషీన్ లర్నింగ్ కోర్సులను ప్రవేశపెడుతున్నారు.

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, డేటా సైన్స్, ఏఐ-మెషీన్ లర్నింగ్ కోర్సులకు విపరీతమైన డిమాండ్ ఉంది. మానవ వనరుల కొరత ఉంది.అందుకే వీటికి ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది.

వీటితోపాటు సీఎస్ఈలో కృత్రిమ మేధస్సు, డేటా సైన్స్ , సైబర్ సెక్యూరిటీ, ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్, సైబర్ సెక్యూరిటీలో బ్లాక్ చైన్ టెక్నాలజీ, కృత్రిమ మేధస్సు-మెషీన్ లర్నింగ్, మెకానికల్ లో రోబోటిక్ కోర్సులకు ఏఐసీటీఈ ఆమోదం తెలిపింది.

ఇవన్నీ ప్రస్తుత సమాజంలో అత్యవసరమైన సాంకేతికాలు కావడంతో ఆ దిశగా విద్యార్థులను తయారు చేయడానికి కేంద్రం ఈ కోర్సులకు ఆమోదం తెలిపింది.