షాకింగ్ః ఆర్మీ రిక్రూట్ పరీక్ష పేపర్ లీక్.. దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు!

Sun Feb 28 2021 19:00:01 GMT+0530 (IST)

Shocking: Army Recruitment Exam Paper Leaked

పరీక్ష పేపరు లీకేజీ బారిన ఆర్మీ కూడా చేరింది! ఇండియన్ ఆర్మీలో సాధారణ సిబ్బందిని  నియమించేందుకు దేశవ్యాప్తంగా రిక్రూట్ మెంట్ ఎగ్జామ్ ను కండక్ట్ చేసేందుకు సిద్ధమయ్యారు అధికారులు. కానీ.. ఆ పరీక్షకు సంబంధించిన ప్రశ్నాపత్రం లీకవడంతో ఆ పరీక్షను రద్దు చేసినట్టు ప్రకటించింది ఆర్మీ.ఈ మేరకు అధికారులు ఫిబ్రవరి 28వ తేదీ(ఆదివారం)న ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. ఆర్మీ రిక్రూట్మెంట్ విధానంలో అవినీతి చర్యలను ఎట్టి పరిస్థితుల్లోనూ సహించేది లేదని స్పష్టం చేశారు. ఈ నియామక ప్రక్రియలో పారదర్శకత ఉండాలనే ఉద్దేశంతోనే పరీక్షను రద్దు చేసినట్లు వారు తెలిపారు.

కాగా.. గత రాత్రి పుణెలో స్థానిక పోలీసులతో నిర్వహించిన జాయింట్ ఆపరేషన్ లో ఈ పేపరు లీకేజీ వ్యవహారం బయటపడిందని అధికారులు తెలిపారు. ఈ పేపర్ లీకేజీకి సంబంధించి పుణెలోని బారామతిలో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసినట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్ష మళ్లీ ఎప్పుడు నిర్వహిస్తారనేది తెలియాల్సి ఉంది.