నిద్రలేమితో బాధపడుతున్నారా ..అయితే ఇలా చేయండి !

Thu Feb 20 2020 09:00:01 GMT+0530 (IST)

Are you suffer from Insomnia

ప్రస్తుత రోజుల్లో చాలామంది నిద్రలేమి సమస్యతో భాదపడుతున్నారు. ఇంకా చెప్పాలంటే.. ఒత్తిడి ఆందోళన మానసిక సమస్యలు దీర్ఘకాలిక అనారోగ్యాలతో సతమతమవుతున్నారు. ఈ సమస్యల నుండి ఉపశమనం లభించాలని రకరకాల ప్రయత్నాలు చేస్తుంటారు. కానీ ఎలాంటి లాభాలు కనిపించవు. మరి ఈ నిద్రలేమికి చెక్ పెట్టాలంటే ... మీ భాగస్వామి ధరించిన దుస్తులు మీ దగ్గర ఉంటే చాలు.అసలు నిద్రలేమి సమస్యకి ...భాగస్వామి దుస్తులకి సంబంధం ఏమిటి అని అనుకుంటున్నారా? కెనడాకు చెందిన యూనివర్శిటీ ఆఫ్ బ్రిటీష్ కొలంబియా పరిశోధకులు ఈ విషయాన్ని వెల్లడించారు. రొమాంటిక్ పార్ట్నర్ మన నిద్ర క్వాలిటీని పెంచడానికి ఉపయోగపడతారని ప్రయోగ పూర్వకంగా నిరూపించారు. భాగస్వామి ధరించిన టీషర్ట్ ను తలగడకు చుట్టి దానిపై నిద్రిస్తే చక్కగా నిద్రపడుతుందని వారు జరిపిన పరిశోధనలో తేలింది. స్లీప్ క్వాలిటీ లవర్స్ స్మెల్ మధ్య సంబంధాలను తెలుసుకోవటానికి అయన బృందం ఒక భిన్నమైన ప్రయోగం చేశారు.

భాగస్వాములున్న ఆడ మగలను 24 గంటల పాటు నిర్విరామంగా టీషర్ట్ వేసుకునేలా చేసి అలాగే ఆ సమయంలో వారు శరీరపరిమళాలు వాడకూడదని ఘాటైన వాసనలు కలిగిన ఆహార పదార్థాలు తినకూడదని నిబంధన విధించారు. ఆ తర్వాత ఓ జంటకి ..ఇద్దరి టీ షర్ట్స్ ని మార్చుకొని ఒకరి టీ షర్ట్ ని మరొకరు తలగడగా పెట్టుకొని నిద్రపోయేలా చేశారు. ఆలా చేసిన తరువాత వారు కనుగొన్న విషయం ఏమిటంటే .. ఇతర వ్యక్తి టీషర్టు పై నిద్రించినప్పటికంటే భాగస్వామి టీషర్టు పై నిద్రించినపుడు వారు ఎక్కువ సేపు నిద్ర పోయినట్లు తమ పరిశోధన లో కనుగొన్నారు. అలాగే భాగస్వామి శరీర వాసనలకు దగ్గరగా నిద్రించినవారు నిద్ర మధ్య లో మేల్కోవటం కదలటం లాంటివి చేయలేదని తెలిపారు. భాగస్వామి శరీర వాసనలు నిద్ర పట్టడానికి ఉపయోగించే స్లీపింగ్ ట్యాబ్లెట్లలా పనిచేశాయి అని పరిశోధకుడు మార్లిసే హోఫర్ తెలిపారు.