Begin typing your search above and press return to search.

అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి వారే కారణమా..?

By:  Tupaki Desk   |   27 May 2022 12:30 AM GMT
అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి వారే కారణమా..?
X
ఓ వ్యక్తి గన్ పట్టుకొని ఎదుటి వాళ్లను షూట్ చేసుకుంటూ పోవడం.. మనం సినిమాల్లోనే చూస్తాం.. కానీ ఇప్పుడు అమెరికాలో ఎక్కడ క్రైమ్ జరిగినా ఇది రియల్ గా కనిపిస్తోంది. అగ్రదేశంలో రోజురోజుకు గన్ కల్చర్ పెరిగిపోతోంది. నిత్యం పాకెట్లో గన్ పెట్టుకున్న వారు చిన్న చిన్న కారణాలకే దానికి పని చెబుతున్నారు.

తాజాగా మంగళవారం ఓ స్కూల్ లోని 19 మంది చిన్నారులతో పాటు 21 మందిని ఓ వ్యక్తి కాల్చి చంపాడు. ఇలాంటివి ఏడాదిలోపు 27 సంఘటనలు చోటు చేసుకున్నాయి. ప్రపంచంలోని మిగతా దేశాల కంటే అమెరికాలోనే ఎక్కువగా గన్స్ ఉన్నట్లు నివేదికలు చెబుతున్నాయి. అయితే ఈ దేశంలో ఇంతలా తుపాకులు వాడడానికి కారణం ఏంటి..? ఎవరు గన్ మార్కెట్ ను విస్తృతం చేస్తున్నారు..? దీనిని అడ్డుకునేవారు లేరా..?

50 ఏళ్ల కిందట అమెరికాలో 9 కోట్ల తుపాకులు ఉన్నట్లు సమాచారం. 2011 లెక్కల ప్రకారం 88 కోట్లకు పైగానే ఉన్నట్లు సమాచారం. అంతేకాకుండా ఎక్కువ శాతం మరణాలు గన్ కాల్చడం వల్లే చనిపోయారని నివేదికలు తెలుపుతున్నాయి. అయితే ఈ గన్ కల్చర్ ను అమెరికా ఎందుకు ఆపలేదన్న ప్రశ్న తలెత్తుతోంది.అంతేకాకుండా దీనిని కొనసాగించడానికి కొందరు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నట్లు సమాచారం.

2019 ఏప్రిల్ నుంచి 2011 మధ్య అమెరికాలో 7.5 మిలియన్ల మంది మొదటిసారిగా తుపాకులను కొనుగోలు చేసినట్లు నివేదికల ద్వారా తెలుస్తోంది. ఇలా కొనుగోలు చేసిన వారిలో పిల్లలు కూడా ఉన్నారు. గత రెండు సంవత్సరాల కాలంలో కరోనా విజృంభిస్తున్నా.. చాలా మంది గన్ కు పనిచెప్పారు. 1968 నుంచి 2017 మధ్య అమెరికాలో గన్ ను వాడడం వల్ల 15 లక్షల మంది మరణించారు. యూఎస్ సెంటర్స్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్సన్ (సీడీసీ) ప్రకారం 2020లో గన్ ను పేల్చడం వల్ల 45 వేల మంది మరణించారు. అయితే ఇందులో హత్యలు, ఆత్మహత్యలు ఉన్నాయి. వీటీలో ఆత్మహత్యలు 24,300 ఉన్నట్లు సమాచారం. ఆత్మహత్య చేసుకోవాలనుకున్నవారు అమెరికాలో ఎక్కువగా గన్ వాడడం గమనార్హం.

అమెరికాలో గన్ కల్చర్ పెరగడంపై సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడి రాజ్యాంగం ప్రకారం ఆయుధాలను హక్కుగా భావిస్తారు. కానీ కొందమంది దీనిని వ్యతిరేకిస్తున్నారు. 2020లో అమెరికాలో నిర్వహించిన ‘గన్ కల్చర్ నియంత్రణ కోసం చట్టాలను కఠినతరం చేయడం అవసరమా..?’అనే సర్వేలో 52 శాతం మాత్రమే మద్దతు ఇచ్చారు. మిగతావారిలో 35 శాతం మంది చట్టాల్లో మార్పు చేయాల్సిన అవసరం లేదన్నారు. 11 శాతం మంది మాత్రం చట్టాలను కఠినతరం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

2018లో ప్రపంచ వ్యాప్తంగా 3.9 కోట్ల తుపాకులు ఉన్నాయని స్విట్జర్లాండ్లోని స్మాల్ అర్మ్స్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో తెలిపింది. ఇందులో అమెరికాలోనే ప్రతి వందమంది పౌరుల్లో 120 తుపాకులు కలిగి ఉన్నట్లు పేర్కొంది. అంటే ఇతర దేశాల్లో కంటే అమెరికాలోనే ఎక్కువ మంది గన్స్ కలిగి ఉన్నారు. అయితే ఈ రెండేళ్లలో వీటి సంఖ్య మరింత పెరిగినట్లు తెలుస్తోంది. అమెరికాలో గన్ కల్చర్ పెరిగిపోవడానికి నేషనల్ రైఫిల్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏ) కారణమని తెలుస్తోంది. వీరు పెద్ద ఎత్తున డబ్బును కలిగి ఉన్నారని, రాజకీయ అండదండలతో వీరు గన్ మార్కెట్ ను విస్తృతం చేస్తున్నారని కొందరు అభిప్రాయపడుతున్నారు. దీంతో గన్ కల్చర్ నిషేధాన్ని కోరే సభ్యుల కంటే ఎన్ఆర్ఏ సభ్యుల ప్రభావమే ఎక్కువగా ఉంటుంది.